అగ్రరాజ్యంలో రాకాసి దోమల దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జంతువులు...!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మొదలైన తర్వాత విదేశాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు, మిడతల దండు, అతి భారీ వర్షాలు లాంటి విపత్తులు లాగానే మరో అతి భయంకరమైన విపత్తు ప్రస్తుతం అమెరికా దేశాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది.

అమెరికా దేశంలో వందలాది జంతువులపై రాకాసి దోమలు విపరీతంగా దాడి చేస్తున్నాయి.

ఇప్పటికే అమెరికాలోని అనేక వందల జంతువులను ఈ రాకాసి దోమలు పొట్టన పెట్టుకున్నాయి.ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తో పాటు ఈ దారుణ సంఘటన కూడా సంభవిస్తున్నాయి.

గుంపులు గుంపులుగా వచ్చి రాకాసి దోమలు అడవిలోని వన్యప్రాణులతో సహా ఇంట్లో ఉండే పాడి జంతువులను కూడా బలి తీసుకుంటున్నాయి.ఇకపోతే ఈ సంఘటనలో లూసియానా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి.

అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వస్తున్నాయి.లూసియానా ప్రాంతంలోని అనేక గేదెలు, ఆవులు, జింకలు వంటి వాటిని ఈ రాకాసి దోమలు గుంపు గుంపులు గా దాడిచేసి చంపేస్తున్నాయని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఉన్న 400 పైగా పాడిపశువులను, అలాగే 20 వరకు జింకలు మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో ఈ దోమల బెడద వారిని దిక్కుతోచని పరిస్థితిలు ఏర్పరుస్తున్నాయ్.

ఈ సంఘటనతో ఏకంగా అమెరికాలో లక్షల డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.ఇక ఈ దోమలను నివారించేందుకు హెలికాప్టర్లతో సహా రంగంలోకి దిగాయి సహాయక బృందాలు.

ఈ సహాయ బృందాలు దోమల మందులు పిచికారి చేశాయి.కాకపోతే, కొంతవరకు మాత్రమే ఆ దోమల బెడద ను తగ్గించే ప్రయత్నం చేశాయి.

ఇంకా పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు.ఇటీవల సంభవించిన వరదల ప్రాంతాల్లో కూడా ఈ దోమకాటుకు సంబంధించి అనేక మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పాడి పశువులే కాకుండా అనేక జీవులు కూడా చనిపోయినట్లు ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు