డాన్ శీను మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే?

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్ శీను మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

శ్రియ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటించగా శ్రీహరి కీలక పాత్రలో నటించారు.

ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో ఒక హీరో కొరకు తయారు చేసిన స్క్రిప్ట్ లో మరో హీరో నటించడం జరుగుతుంది.రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

మొదట డాను శీను స్క్రిప్ట్ ను గోపీచంద్ మలినేని స్టార్ హీరో ప్రభాస్ కు వినిపించారట.స్టోరీ లైన్ విన్న ప్రభాస్ సినిమా చేద్దామని గోపీచంద్ మలినేనికి మాటిచ్చారు.

ఆ సమయంలో ప్రభాస్ దశరథ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటిస్తున్నారు.గోపీచంద్ మలినేనికి హీరో గోపీచంద్ రిలేటివ్ కాగా ఇదే కథను దర్శకుడు గోపీచంద్ కు కూడా వినిపించడం జరిగింది.

Advertisement
These Tollywood Heroes Missed Chance In Raviteja Don Seenu Movie Details, 2010

గోపీచంద్ కు కథ నచ్చినా అదే సమయంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గోలీమార్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆ సినిమా చేయలేకపోయారు.

These Tollywood Heroes Missed Chance In Raviteja Don Seenu Movie Details, 2010

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు డాన్ శీను మూవీ కథ విని ఈ కథ రవితేజకు బాగుంటుందని సూచించగా గోపీచంద్ మలినేని రవితేజకు కథ చెప్పి ఒప్పించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది.

These Tollywood Heroes Missed Chance In Raviteja Don Seenu Movie Details, 2010

హీరోలు ప్రభాస్, గోపీచంద్ డాను శీను సినిమాను మిస్ కాగా రవితేజ్ కెరీర్ లో ఈ సినిమాతో మరో సక్సెస్ చేరింది.2010 సంవత్సరం జనవరి 10వ తేదీన రిలీజైన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావడంతో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు