మధుమేహం ఉన్నవారు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన మూడు కూరగాయలు ఇవే!

ఇటీవల రోజుల్లో మధుమేహం బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.ముప్పై ఏళ్ల వారు సైతం మధుమేహానికి గురవుతున్నారు.

ఇది దీర్ఘకాలిక వ్యాధి.ఒకసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.

అయితే మధుమేహం ఉన్నవారికి ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న అవగాహన లేక చాలా సతమతం అవుతుంటారు.అయితే ఏం తిన్నా తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే మూడు కూర కాయలు మాత్రం వారంలో ఒక్కసారైనా ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

మరి ఆ మూడు కూరగాయలు ఏంటి.వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బెండకాయ..

( Ladies finger ) ఏడాది పొడవునా లభించే కూరగాయల్లో ఒకటి.మధుమేహులకు బెండకాయ ఒక వరం అని చెప్పవచ్చు.

బెండకాయను డైట్ లో చేర్చుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బెండకాయ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఇది మధుమేహాన్ని తగ్గించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.అదే సమయంలో గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఇన్సులిన్ ను కూడా మెరుగుపరుస్తుంది.అందుకే మధుమేహం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయినా బెండకాయను తీసుకోవాలి.

Advertisement

మధుమేహుల‌కు మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ( Bitter gourd )ఒకటి.కాకరకాయ చేదుగా ఉన్న ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా మధుమేహుల‌కు కాకరకాయ సూపర్ ఫుడ్.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది.జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.

ఇక మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బీట్ రూట్ ( Beetroot )ఒకటి.మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో చాలామంది బీట్ రూట్ తియ్యగా ఉంటుందని అవాయిడ్ చేస్తుంటారు.బీట్‌రూట్ సహజ చక్కెరను కలిగి ఉంటుంది.

కాబట్టి ఇది మీ శరీరానికి హాని కలిగించదు.మధుమేహుల‌కు బీట్ రూట్‌ చక్కని పోషకాహారం.

బీట్ రూట్ ను డైట్ లో చేర్చుకుంటే.అది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

రక్తహీనతను దూరం చేస్తుంది.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

అతి ఆకలిని సైతం నివారిస్తుంది.

తాజా వార్తలు