మీకు తెలిసిందే, ఈ మధ్యకాలంలో అదానీ పేరు బాగా వినబడుతోంది.ఈ గ్రూప్‌లోని విద్యుత్ రంగ కంపెనీ అయినటువంటి ‘అదానీ పవర్ లిమిటెడ్’ మరింత పవర్‌ఫుల్‌గా తయారైంది నేడు.
అదానీ పవర్ (ముంద్రా) సహా 6 అనుబంధ సంస్థలు అదానీ పవర్‌లో విలీనం అయినట్టు సమాచారం.ఈ మేరకు అదానీ పవర్ మంగళవారం అనగా 07 మార్చి 2023న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అదానీ పవర్ లిమిటెడ్‌లోకి, కంపెనీ పూర్తి యాజమాన్యంలోని ఆరు అనుబంధ కంపెనీల విలీనాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ ఫిబ్రవరి 8, 2023న ఆమోదించినట్లు BSE ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది.
కాబట్టి, వీటన్నింటి వ్యాపార, ఆర్థిక లెక్కలను, ఆర్థిక నివేదికలను అదానీ పవర్ లిమిటెడ్ ఇకనుండి వెల్లడిస్తుంది.అదానీ పవర్ షేర్ ధర నిన్నటికి అనగా బుధవారం, 08 మార్చి 2023న కూడా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ కావడం విశేషం.జీక్యూజీ పార్ట్‌నర్స్ డీల్ తర్వాత, గత 5 ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ దాదాపు 22% లాభపడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ 4 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లు తాకాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో బాగా లాభపడినట్టు తెలుస్తోంది.అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ACC కూడా ఊపందుకోగా.అంబుజా సిమెంట్స్ NDTV షేర్లు నెగెటివ్ నోట్‌లో స్టార్ట్ కావడం కొసమెరుపు.ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే గ్రీన్ జోన్‌కు చేరుకున్నాయి.
అదానీ పవర్ లిమిటెడ్‌లో విలీనం అయిన అనుబంధ కంపెనీలు ఇవే…
1.అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ 2.అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ 3.ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 4.రాయ్‌పూర్ ఎనర్జెన్ లిమిటెడ్ 5.రాయ్‌ఘర్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ 6.అదానీ పవర్ (ముంద్రా) లిమిటెడ్