చేతి గోర్ల‌ను పొడ‌వుగా, స్ట్రాంగ్ గా పెంచే సింపుల్ రెమెడీస్..!

చేతి గోర్లను పొడ‌వుగా పెంచుకోవ‌డం కోసం తెగ ఆరాట‌ప‌డుతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు పొడ‌వాటి గోర్ల కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కానీ.ఇంటి ప‌నులు, వంట ప‌నులు మ‌రియు ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల గోర్లు త‌ర‌చూ విరిగిపోతుంటాయి.

దాంతో చేసేదేమి లేక చాలా మంది కృతిమ గోర్ల‌పై ఆధార ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీస్‌ను ట్రై చేస్తే గానుక గోర్లు స‌హ‌జంగానే పొడ‌వుగా,స్ట్రాంగ్ గా పెరుగుతాయి.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీస్ ఏంటో.వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement
These Simple Remedies Help To Make Nails Long And Strong! Simple Remedies, Nail,

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాల మీగ‌డ‌, హాఫ్‌ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని గోర్ల‌కు అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.

గంట లేదా రెండు గంట‌ల అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక చేతి గోర్లు విరిగిపోకుండా బ‌లంగా, పొడ‌వుగా పెరుగుతాయి.

These Simple Remedies Help To Make Nails Long And Strong Simple Remedies, Nail,

అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని పీల్ తొల‌గించి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ స్లైసెస్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

చివ‌రిగా ఆ జ్యూస్‌లో మూడు చుక్క‌లు గార్లిక్ ఎసెన్షియల్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని.గోర్ల‌కు అప్లై చేసుకోవాలి.ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు ఇలా చేసినా కూడా గోర్లు పొడ‌వుగా, స్ట్రోంగ్‌గా పెరుగుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కాబ‌ట్టి, అంద‌మైన పొడ‌వాటి గోర్ల‌ను కోరుకునే వారు ఖ‌చ్చితంగా ఈ రెండు రెమెడీస్‌ను ప్ర‌య‌త్నించండి.

Advertisement

తాజా వార్తలు