మతిమరుపు దూరం అవ్వాలంటే ఇవి తీసుకోవాల్సిందే...!

ప్రస్తుతం ఆధునిక కాలంలో రోజుకో టెక్నాలజీ ఏవిధంగా పెరుగుతుందో.మరోవైపు మానవ శరీరంలో రోగాలు కూడా అలాగే పెరుగుతున్నాయి.

కొత్త కొత్త వ్యాధులతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రపంచ ప్రజలు.ఇక గత ఎనిమిది నెలల నుండి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక అది అలా ఉంటే ప్రపంచంలో చాలామంది ఇబ్బంది పడే ఒక సమస్య మతిమరపు.ఈ మతిమరుపును దూరం చేసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఆకు కూరలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

Advertisement

నిజానికి కూరగాయల తో పోల్చితే ఆకుకూరల్లో ఎక్కువగా పోషకాలు శరీరానికి లభిస్తాయి.ఇక మతిమరుపు పోవడంలో పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.

అనేక పోషక పదార్థాలు కలిగిన పాలకూరలో ఈ మతిమరుపును దూరం చేయడానికి అవసరమయ్యే ఫ్లేవనాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పాలకూరలో ఏకంగా 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు మనకు లభిస్తాయి.

పాలకూర తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధికి సంబంధించి కూడా యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తుంది.అంతేకాదు పాలకూర తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు అని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.

అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలను అదుపు చేయడానికి పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

నిజానికి పాలకూరలో ఫాస్పరస్, ఐరన్, క్లోరిన్, సోడియం, క్యాల్షియం, విటమిన్ A, విటమిన్ C లాంటి అనేక ఖనిజ లవణాలు, పోషక విలువలు మనకు లభిస్తాయి.పాలకూరలో కాస్త ఐరన్ ఎక్కువగా ఉండటం ద్వారా రక్తాన్ని శుభ్రపరచడానికి బాగా ఉపయోగపడుతుంది.అంతేకాదు పాలకూర స్త్రీల సౌందర్యానికి కాపాడడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

Advertisement

పాలకూరను కేవలం ఒక కూరలోను, సలాడ్స్ లోను మాత్రమే కాకుండా అనేక రకాల వెరైటీలు చేసుకొని భుజించవచ్చు.

తాజా వార్తలు