జగన్ కంటికి తగిలి ఉంటే ఇలాంటి కామెంట్లు వినిపించేవా.. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై పదునైన వస్తువుతో దాడి జరగగా జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్షించారు.

అయితే ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరుగుతాయని ఇదంతా డ్రామా అని ఒక పార్టీ అనుకూల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి.

ఆ పదునైన వస్తువు జగన్ కంటికి తగిలి ఉంటే ఇలాంటి కామెంట్లు వినిపించేవా అని వైసీపీ అభిమానుల( YCP Fans ) నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.తమ పార్టీ నేతలపై కూడా ఈ తరహా దాడులు జరిగి ఉంటే డ్రామా అని ఇదే విధంగా రియాక్ట్ అయ్యేవారా? అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.జగన్ ను భయాందోళనకు గురి చేయాలనే ఆలోచనతోనే ఈ తరహా దాడికి కుట్ర జరిగిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన జగన్ పాలనపై నిరసన తెలపాలని చేసిన ఘటన కాదని ప్రణాళికబద్ధంగానే చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

These Questions From Ycp Fans Aboout Attack On Cm Jagan Details Here Goes Vir

టీడీపీ నేతలు( TDP Leaders ) మాత్రం 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి గాయాన్ని( Kodi Kathi ) జగన్ ఏ విధంగా ప్రచారానికి వాడుకున్నారో ఇప్పుడు అదే విధంగా రాయి ఘటనను వాడుకుంటారని చెబుతున్నారు.జగన్ పై దాడి చేసిందెవరో వెలుగులోకి వస్తే అసలు నిజాలు వాటంతట అవే బయటకు వస్తాయని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.జగన్ పై సానుభూతి ప్రకటించకుండా కోడికత్తి కమల్ హాసన్ అంటూ టీడీపీ చేస్తున్న పోస్ట్ లపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు.

These Questions From Ycp Fans Aboout Attack On Cm Jagan Details Here Goes Vir
Advertisement
These Questions From Ycp Fans Aboout Attack On Cm Jagan Details Here Goes Vir

ఆధారాలు ఉంటే ప్రూవ్ చేసి జగన్ ను నిందించాలని వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు.జగన్ మొండివాడని ఆయనను భయపెట్టాలని చూసినా భయపడడని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సరిగ్గా నెల రోజుల సమయం ఉండగా ఈ సమయంలో చోటు చేసుకుంటున్న ఘటనలు వైసీపీ శ్రేణులను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు