వింట‌ర్‌లో లంగ్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్తలు త‌ప్ప‌ని స‌రి!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.చ‌లి రోజు రోజుకు పెరిగి పోతోంది.

ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా ర‌క‌ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులపై ఎటాక్ చేసి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటాయి.అందుకే వింట‌ర్‌లో లంగ్స్‌ను హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే త‌ప్ప‌ని స‌రిగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మరి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.త్రిఫల టీ.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ వింట‌ర్ సీజ‌న్‌లో రోజుకో ఒక క‌ప్పు త్రిఫ‌ల టీని తీసుకుంటే గ‌నుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మార‌డంతో పాటుగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

Advertisement

అదే స‌మ‌యంలో చ‌లిని త‌ట్టుకునే శ‌క్తీ శ‌రీరానికి ల‌భిస్తుంది.

అలాగే ప్ర‌తి రోజు ఉద‌యాన్నే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ అల్లం ర‌సం, ఒక స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసుకుని సేవించాలి.త‌ద్వారా లంగ్స్ శుభ్ర‌ ప‌డ‌తాయి.అదే స‌మ‌యంలో శ్వాస సంబంధిత మార్గంలో ఏవైనా అడ్డంకులు ఉన్నా తొల‌గిపోతాయి.

ఏ సీజ‌న్‌లో చేసినా చేయ‌క‌పోయినా చ‌లి కాలంలో మాత్రం త‌ప్ప‌కుండా శ్వాస సంబంధిత‌ వ్యాయామాలు రెగ్యుల‌ర్‌గా చేయాలి.త‌ద్వారా ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది.శ్వాస స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

మ‌రియు రక్త సరఫరా సైతం సాఫీగా సాగుతుంది.ధూమపానం చేసే అల‌వాటు ఉంటే ఖ‌చ్చితంగా ఈ చ‌లి కాలంలో మానుకోవాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

జంక్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవ‌డం మానుకోవాలి.లేదంటే లంగ్స్ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు గురి కావాల్సి ఉంటుంది.

Advertisement

ఇక డైట్‌లో తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, తృణ‌ధాన్యాలు ఉండేలా చూసుకోండి.ప్ర‌తి రోజు రెండు నుంచి మూడు తుల‌సి ఆకులను న‌మిలి తినండి.

మ‌రియు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోండి.

తాజా వార్తలు