ఆయిలీ హెయిర్‌ను సుల‌భంగా నివారించే న్యాచుర‌ల్ షాంపూ మీకోసం!

ఆయిలీ హెయిర్‌.చాలా మందిని ఇబ్బంది పెట్టే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.

జుట్టు ఎంత ఒత్తుగా, పొడ‌వుగా ఉన్నా.ఆయిలీ ఆయిలీగా ఉంటే చూసేందుకు అందవిహీనంగానే క‌నిపిస్తుంది.

దాంతో ఆయిలీ హెయిర్‌ను నివారించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల షాంపూలు యూజ్ చేసి విసిగిపోతుంటారు.అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ హోమ్ మేడ్ షాంపూను వాడితే.

చాలా సుల‌భంగా ఆయిలీ హెయిర్‌కి గుడ్ బై చెప్ప‌వ‌చ్చు.మ‌రి ఆ సూప‌ర్ న్యాచుర‌ల్ షాంపూను ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల హాట్ వాట‌ర్ పోయాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో గింజ తీసేసిన కుంకుడు కాయ‌లు ఒక క‌ప్పు, శీకాకాయ‌లు ఒక క‌ప్పు, మెంతులు రెండు స్పూన్లు వేసుకుని రాత్రంతా నాన బెట్టుకోవాలి.ఉద‌యాన్నే స్ట‌వ్‌పై పెట్టి నీరు స‌గం అయ్యే వ‌ర‌కు బాగా హీట్ చేసుకోవాలి.

ఆపై కాస్త చ‌ల్లార‌నిచ్చి.వ‌డ‌బోసుకుంటే షాంపూ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ స‌హ‌జ సిద్ధ‌మైన షాంపూను వాడి త‌ల స్నానం చేస్తే ఆయిలీ హెయిర్ స‌మ‌స్యే ఉండ‌దు.పైగా జుట్టు షైనీగా మెరిసిపోతుంది.

అలాగే మ‌రో విధంగా కూడా షాంపూను రెడీ చేసుకోవ‌చ్చు.అందు కోసం ఒక బౌల్‌లో గ్లాస్ వాట‌ర్ పోసి హీట్ చేయాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

నీరు కాస్త వేడి అయిన వెంట‌నే.ఒక‌ స్పూన్ కుంకుడుకాయ‌ల పొడి, ఒక స్పూన్ శీకాకాయ‌ల పొడి, ఒక స్పూన్ ఉసిరి కాయ‌ల పొడి, అర‌ స్పూన్ బియ్యం పిండి వేసుకుని ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి.

Advertisement

అనంత‌రం గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత వ‌డ‌బోసుకుంటే షాంపూ రెడీ అయిన‌ట్టే.ఈ న్యాచుర‌ల్ షాంపూతో త‌ల స్నానం చేసినా ఆయిలీ హెయిర్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.అలాగే జుట్టు రాల‌డం, తెల్ల‌గా మార‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ద‌రి చేరకుండా ఉంటాయి.

తాజా వార్తలు