మొండి దగ్గుతో మదన పడుతున్నారా.. ఇలా చెక్ పెట్టండి!

సీజన్ మారుతున్నప్పుడు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ఈ జాబితాలో దగ్గు ముందు వరుసలో ఉంటుంది.

దగ్గు చిన్న సమస్యగానే అనిపించిన ప్రాణం తోడేస్తుంది.దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

పని పై దృష్టి సారించలేకపోతుంటారు.ఈ క్రమంలోనే దగ్గును (cough)వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గు తగ్గదు.దాంతో ఏం చేయాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.

Advertisement
These Home Remedies Help To Rid Of Cough Quickly! Home Remedies, Latest News, Co

అయితే మొండి దగ్గుకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

These Home Remedies Help To Rid Of Cough Quickly Home Remedies, Latest News, Co

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఫ్యాట్ లెస్ మిల్క్ (Milk) పోసుకోవాలి.పాలు హీట్‌ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు(turmeric), నాలుగు పీల్ తొలగించి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు (Garlic cloves)వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మిల్క్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

ఈ గార్లిక్ మిల్క్ రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే ఎలాంటి మొండి దగ్గు అయినా సరే పరార్ అవుతుంది.జలుబు ఉంటే తగ్గుతుంది.గొంతు నొప్పి, గొంతు వాపు (Sore throat, throat swelling)వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

These Home Remedies Help To Rid Of Cough Quickly Home Remedies, Latest News, Co

అలాగే మొండి దగ్గు(Stubborn cough) నివారణకు దానిమ్మ కూడా చాలా బాగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దానిమ్మ గింజలు (Pomegranate seeds)వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు దానిమ్మ జ్యూస్ లో చిటికెడు మిరియాల పొడి(Pepper powder), చిటికెడు అల్లం పొడి కలిపి సేవించాలి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఈ విధంగా కనుక చేస్తే మొండి దగ్గు నుంచి వేగంగా రిలీఫ్ పొందుతారు.పైగా దానిమ్మ జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.రక్తహీనతను పోగొడుతుంది.

Advertisement

చర్మాన్ని గ్లోయింగ్ గా సైతం మెరిపిస్తుంది.

తాజా వార్తలు