ప్రతిరోజు ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఇనుప కవచంలా మారుతుంది..!

ఈ ఆహార పదార్థాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుంది.

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకుంటే కొద్దిరోజుల్లోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మన శరీరంలో రోగనిరోధక శక్తి ఈ సూక్ష్మజీవులను ట్రాప్ చేయడం ద్వారా చంపేస్తుంది.శరీరంలో రోగ నిరోధక శక్తి అనేక స్థాయిలలో ఏర్పడుతుంది.

ఒకటి రక్తంలో డబ్ల్యూబీసీ గా మరొకటి లింఫ్ నోడ్‌ లో ఉంటుంది.ఇవన్నీ కలిసి రోగ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.

ప్రతిరోజు ఇందులో ఏదో ఒక ఆహార పదార్థాలను తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి ఇనుప కవచం లాగా ఏర్పడుతుంది.అందుకే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

Advertisement

రోగనిరోధక శక్తిని త్వరగా పెంచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్లలో విటమిన్ సి( Vitamin C ) ఎక్కువగా ఉంటుంది.

ఇది రోగ నిరోధక శక్తిని త్వరగా పెంచుతుంది.అలాగే విటమిన్ సి కారణంగా రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాటంలో ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే ఎర్ర క్యాప్సికం తినడం వల్ల రోగ నిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది.ఎరుపు క్యాప్సికం లో నారింజ కంటే మూడు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

అంతే కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.వెల్లుల్లి అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుకే మనం రోజు తినే ఆహార పదార్థాలలో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగించాలి.

Advertisement

అల్లం సహజ గుణాలతో నిండి ఉంటుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇది అన్ని రకాల వాపులను దూరం చేస్తుంది.అధిక కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుంది.

తాజా వార్తలు