బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆ దేశంలో ఒకప్పుడు కారామెల్ కలర్డ్‌ స్ట్రీట్ డాగ్స్‌ను (Caramel colored street dogs)చాలా చులకనగా చూసేవారు కానీ ఇప్పుడు ఆ రంగు కుక్కలే బ్రెజిల్‌ (Brazil)జాతీయ గర్వానికి, పట్టుదలకు చిహ్నంగా మారాయి.

"విరా-లటా కారామెలో" అంటే "కారామెల్ చెత్తబుట్ట-టిప్పర్" అని అర్థం వచ్చే ఈ కుక్కలు, తమ ప్రత్యేక లక్షణాలతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి.

మీమ్స్, ఫన్నీ(Memes, funny) వీడియోలు, ఆన్‌లైన్ పిటిషన్లు.ఇలా అన్నింట్లోనూ ఈ కారామెలో కుక్కలే హవా! అంతేకాదు, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో "కారామెలో"(caramelo) పేరుతో ఒక సినిమా కూడా రాబోతోంది.అంటే ఈ కుక్కల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.2019లో ఈ కుక్కలకు నిజమైన గుర్తింపు లభించింది, వాటికి పట్టాభిషేకం జరిగింది.సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఒక వీడియోలో, డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుండగా ఒక కారామెలో కుక్క స్టేజిపైకి వచ్చి మూత్రం పోసింది.మరొక వీడియోలో, సీపీఆర్ శిక్షణ జరుగుతుండగా ఒక కుక్క చనిపోయినట్లు నటించింది.

ఈ ఫన్నీ వీడియోలు బ్రెజిల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కుక్కల పాపులారిటీతో, వాటి బొమ్మను బ్రెజిల్ కరెన్సీ(Brazilian currency) నోట్లపై ముద్రించాలని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

Advertisement

ఏకంగా పదివేల మందికి పైగా ఈ పిటిషన్లపై సంతకాలు చేశారు.దీంతో ఈ కుక్కలు బ్రెజిల్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి.

బ్రెజిల్‌లో కారామెలో కుక్కలను దయ, పట్టుదల, మనుగడకు ప్రతిరూపంగా చూస్తారు.చాలామంది బ్రెజిలియన్లు ఈ లక్షణాల గలవారికి బాగా ప్రాధాన్యత ఇస్తారు అవి జంతువులైనా సరే.అందుకే ఈ కుక్కలను కూడా అంతగా ప్రేమిస్తారు.సంకర జాతికి చెందిన ఈ కారామెలోలు, బ్రెజిల్ విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

దేశీయ, ఆఫ్రికన్(Indigenous, African), వలస మూలాల కలయికే ఈ కారామెలోలు.ఒకప్పుడు ఈ వైవిధ్యాన్ని "మంగ్రెల్ కాంప్లెక్స్" అంటూ తక్కువగా చూసేవారు.

కానీ ఇప్పుడు అదే బ్రెజిల్‌కు ప్రత్యేకత, బలంగా మారింది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?
'ఇది దేశమా? లేక చెత్త కుప్పా?' భారత్‌ను అవమానించిన బ్రిటీష్ టూరిస్ట్!

రియో డి జనీరోకు చెందిన టీచర్ టీనా కాస్ట్రో చెప్పినట్లు, కారామెలో కుక్కల కథ, బ్రెజిల్ దేశ చరిత్రను, పోరాటాలను, అణచివేతను గుర్తు చేస్తుంది."మేము మా దేశాన్ని ఎలా ప్రేమిస్తామో, కారామెలోలను కూడా అలాగే ప్రేమిస్తాము" అని ఆమె అన్నారు.ఈ కుక్కల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

Advertisement

రియో కార్నివాల్ వేడుకల్లో పిల్లలు కారామెలో కుక్కల్లాంటి దుస్తులు వేసుకుంటారు.అంతేకాదు, డియెగో ఫ్రీటాస్ దర్శకత్వంలో "కారామెలో" అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఈ కుక్కలు, ఇప్పుడు బ్రెజిల్ గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి.

తాజా వార్తలు