సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ పరిచయాల ద్వారానే ఎక్కువ అవకాశాలు వస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.ఏదైనా ఒక క్యారెక్టర్ లో ఒక నటుడిని తీసుకోవాలంటే ముందుగా వాళ్లకు తెలిసిన వారిలోనే ఎవరినో ఒకరిని ఆ క్యారెక్టర్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటాం.
ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది నటులు మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తు ఉంటారు.వీళ్ల తోపాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు కాబట్టి ముందు ప్రిఫరెన్స్ అయితే వాళ్లకి కలుస్తాం.

ఇక అందులో భాగంగానే ఫ్రెండ్షిప్ వల్లే ఇక్కడ అవకాశాలను అందుకున్న చాలా మంది ఉన్నారు.ఇక ముఖ్యంగా తరుణ్ భాస్కర్( Tharun Bhascker ) లాంటి డైరెక్టర్ తన టీమ్ మొత్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో పెళ్లిచూపులు ( Pellichoopulu ) అనే సినిమా తీసి తన ఫ్రెండ్స్ అయిన విజయ్ దేవరకొండ, ప్రియదర్శిని, రీతు వర్మ లాంటి నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.అలాగే ఆ సినిమాతో తో తను కూడా డైరెక్టర్ గా పరిచయం అయి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఇక అప్పటినుంచి వీళ్ళ ట్రెండ్ అనేది మొదలైంది.వరుస సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం వీళ్ళ టీమ్ అంతా ఎవరికి వారు సినిమాలు చేస్తు ముందుకు కదులుతున్నారు.

ఇక అప్పట్లో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) రవితేజని( Raviteja ) హీరోగా మార్చడానికి ముఖ్య కారణం కూడా వీళ్ళు ముందు నుంచే మంచి ఫ్రెండ్స్ కావడం అనేది తెలుస్తుంది… ఇక వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి ఫ్రెండ్స్ గా ఉండడమే కారణమని దానివల్లే రవితేజ ను పూరి హీరోగా పెట్టానని పూరి కూడా చాలాసార్లు చెప్పారు.ఇక మొత్తానికైతే ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే తెలిసిన వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ గానీ ఉంది వాళ్ళందరూ ఒకరికొకరు సహాయ, సహకారాలు అందుకుంటూ ముందుకు వెళ్తేనే మంచి అవకాశాలతో పాటు మంచి విజయాలు కూడా దక్కుతాయని భావించే వారు కూడా ఉన్నారు…
.