వన్డే వరల్డ్ కప్ ఆడే జట్ల కెప్టెన్ల రికార్డులు ఇవే..!

భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న ప్రారంభం అవనున్న వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ ఆడే జట్లు వార్మ్ అప్ మ్యాచులు ఆడుతున్నాయి.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్ల కెప్టెన్ల రికార్డ్ల గురించి తెలుసుకుందాం.

 These Are The Records Of Captains Of Odi World Cup Teams , Odi World Cup , Dasu-TeluguStop.com

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ:

36 ఏళ్ల రోహిత్ శర్మ 251 వన్డేలలో 10112 పరుగులు చేశాడు.వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.ఓపెనర్ గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు.

పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్:

28 ఏళ్ల బాబర్ అజామ్ ఇప్పటివరకు 108 వన్డే మ్యాచ్లు ఆడి 19 సెంచరీలతో 5409 పరుగులు చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ:

28 ఏళ్ల హష్మతుల్లా షాహిదీ 64 వన్డే మ్యాచ్లు అడి 1775 పరుగులు చేశాడు.

శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక

: 32 ఏళ్ల దసున్ షనక ( Dasun Shanaka )ఫాస్ట్ బౌలర్ తో పాటు ఆల్రౌండర్.67 వన్డే మ్యాచ్లు ఆడి 1204 పరుగులు చేశాడు.షనక 27 వికెట్లు తీశాడు.

Telugu Dasun Shanaka, Odi Cup, Rohit Sharma, Shakib Al Hasan, Temba Bavuma-Sport

నెదర్లాండ్స్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్:

27 ఏళ్ల స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్.ఇప్పటివరకు 38 వన్డే మ్యాచ్లు ఆడి 1212 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్:

ఇతను స్పిన్నర్ మరియు ఆల్ రౌండర్.240 వన్డే మ్యాచ్లు ఆడి 7384 పరుగులు చేశాడు.బౌలింగ్ విషయానికి వస్తే 308 వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్:

30 ఏళ్ల కమిన్స్ ఫాస్ట్ బౌలర్.ఇప్పటివరకు 77 మ్యాచ్లు ఆడి 126 వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా:

33 ఏళ్ల టెంబా బావుమా( Temba Bavuma ) ఇప్పటివరకు 30 వన్డేలు ఆడి 1367 పరుగులు చేశాడు.

Telugu Dasun Shanaka, Odi Cup, Rohit Sharma, Shakib Al Hasan, Temba Bavuma-Sport

న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్:

న్యూజిలాండ్ 2019లో ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది.కెప్టెన్ కేన్ విలియమ్సన్ 161 వన్డేలు ఆడి 6554 పరువులు చేశాడు.

ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్:

33 ఏళ్ల జోష్ బట్లర్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్.ఇప్పటివరకు 169 వన్డే మ్యాచ్లు ఆడి 4823 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ 2019 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube