తొలి సెమీస్ లో భారత్ సృష్టించిన సరికొత్త రికార్డులు ఇవే..!

ముంబైలోని వాఖండే వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు గెలిచినట్టే అనే ఊహాగానాలను భారత జట్టు నిజమే అని నిరూపించింది.

తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుకు న్యూజిలాండ్ గట్టి పోటీనే ఇచ్చింది.

కానీ ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ లో ముందుకు దూసుకుపోతున్న భారత జట్టు తాకిడికి తట్టుకోలేక ఏకంగా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవి చూసింది.తోలి సెమీస్ లో భారత జట్టు సృష్టించిన సరికొత్త రికార్డులు ఏమిటో చూద్దాం.ముందుగా భారత జట్టు కెప్టెన్ విషయానికి వస్తే.48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు.2015, 2019,2023 ప్రపంచ కప్ లు ఆడిన రోహిత్ శర్మ( Rohit Sharma ) 51 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.అంతే కాదు ఒక వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిట చేరింది.

భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) విషయానికి వస్తే.వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అంతేకాదు ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సచిన్ టెండుల్కర్ 2003 ప్రపంచ కప్ లో 673 పరుగులు చేశాడు.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టేశాడు.

Advertisement

భారత జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer )విషయానికి వస్తే.వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

కేవలం 70 బంతుల్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేశాడు.

భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ విషయానికి వస్తే.ఏకంగా ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.ఈ వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీయడం ఇది మూడవసారి కావడం విశేషం.

అంతేకాదు వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా షమీ సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈ వరల్డ్ కప్ లో షమీ ఆడిన ఆరు మ్యాచ్లలో ఏకంగా 23 వికెట్లు తీసి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు