నలుపును పోగొట్టి అండర్ ఆర్మ్స్ ను మృదువుగా మార్చే మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు ఇవే!

డార్క్ అండర్ అర్మ్స్.( Dark Underarms ) మనలో చాలా మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

పురుషులు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకపోయినా.ఆడవారు మాత్రం డార్క్ అండర్ ఆర్మ్స్ కారణంగా తీవ్ర సౌకర్యానికి గురవుతుంటారు.

స్లీవ్ లెస్ దుస్తులు వేసుకునేందుకు వెనకడుగు వేస్తుంటారు.అయితే నలుపును పోగొట్టి అండర్ ఆర్మ్స్ ను మృదువుగా మార్చే మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి,( Rice Flour ) చిటికెడు బేకింగ్ సోడా,( Baking Soda ) వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
These Are The Most Effective Home Remedies To Get Rid Of Dark Underarms Details,

ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల అండర్ ఆర్మ్స్ లో నలుపు క్రమంగా మాయమవుతుంది.అక్కడి చర్మం మృదువుగా మారుతుంది.

These Are The Most Effective Home Remedies To Get Rid Of Dark Underarms Details,

అలాగే గుప్పెడు పుదీనా ఆకులను( Mint Leaves ) కచ్చాపచ్చాగా దంచి ఒక గ్లాస్ వాటర్ లో వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా ఒక టోనర్ సిద్ధమవుతుంది.

ఈ టోన్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని రోజు ఉదయం సాయంత్రం అండర్ ఆర్మ్స్ లో స్ప్రే చేసుకోవాలి.ఈ టోనర్ ను రోజుకు రెండు సార్లు వాడితే నలుపు మాయం అవ్వడమే కాకుండా అండర్ ఆర్మ్స్ నుండి బ్యాడ్ స్మెల్ సైతం రాకుండా ఉంటుంది.

These Are The Most Effective Home Remedies To Get Rid Of Dark Underarms Details,
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఈ సింపుల్ చిట్కాను పాటించినా కూడా నలుపు తగ్గుతుంది.అండర్ ఆర్మ్స్ స్మూత్ గా మారతాయి.

తాజా వార్తలు