తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన అందమైన బీచ్‌లు ఇవే!

తెలుగు రాష్ట్రాలలో బీచ్‌లకు కొదవలేదు.నిజానికి మన రాష్ట్రాల్లో చాలా ప్రముఖ దక్షిణ భారత బీచ్‌లు ఉన్నాయి.

 These Are The Most Beautiful Beaches In Telugu State, Telugu State Beaches, Goka-TeluguStop.com

ఆ బీచ్‌లలో గోకర్ణ, వోడరేవు, సూర్యలంక, యానాం తప్పక చూడవలసిన ప్రదేశాలు.ఇంకా చూడదగిన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి.

వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• గోకర్ణ బీచ్‌లు:

గోకర్ణ అరేబియా సముద్రంలో ఒక చిన్న పట్టణం.ఇది ప్రశాంతమైన, రద్దీ లేని బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.ప్రత్యేకించి ఈ పట్టణంలో ఉన్న ఓం బీచ్ సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులకు తరచుగా సందర్శించే ప్రదేశం.

బీచ్ సూర్యాస్తమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.ఇక్కడ బీచ్ హోపింగ్, బనానా బోట్ రైడ్ వంటి యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి.

• వోడరేవు బీచ్:

Telugu Bapatla Beach, Gokarna Beaches, Telugu Beaches, Vodarevu Beach, Yanam Bea

ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న వోడరేవు బీచ్‌కు చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 6 గంటల సమయం పడుతుంది.ఈ బీచ్ చీరాల నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది స్విమ్మింగ్, ఫిషింగ్, బోటింగ్ వంటి యాక్టివిటీస్‌తో పాటు ప్రశాంతమైన, వాతావరణాన్ని కూడా అందిస్తుంది.బీచ్‌లో పాత లైట్‌హౌస్ కూడా ఉంది, ఇది అత్యంత అందమైన చుట్టుపక్కల ప్రాంతాలను చూసేందుకు సహాయపడుతుంది.

బీచ్ సమీపంలో లగ్జరీ రిసార్ట్‌లు నుంచి చిన్న రూముల వరకు అనేక వసతి గృహాలు ఉన్నాయి.ఇక్కడికి వచ్చే ప్రజలు ఒక రోజు పర్యటనలో 7 కిమీల సమీపంలోని రామాపురం బీచ్, 22 కిమీల సమీపంలోని సూర్యలంక బీచ్ కూడా విజిట్ చేయవచ్చు.

• సూర్యలంక:

సూర్యలంక బీచ్‌ను బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తారు.ఇది హైదరాబాద్ సమీపంలోని పాపులర్ బీచ్.

ఇక్కడ నవంబర్ నుంచి డిసెంబరు వరకు డాల్ఫిన్లను చూడవచ్చు.ఇది బాపట్ల భావనారాయణ స్వామి ఆలయానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గుంటూరు నగరానికి దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

• మంగినపూడి బీచ్:

Telugu Bapatla Beach, Gokarna Beaches, Telugu Beaches, Vodarevu Beach, Yanam Bea

మంగినపూడి బీచ్ మచిలీపట్నం నుంచి 11 కి.మీ దూరంలో ఉన్న ఒక అందమైన బీచ్.ఇది నల్లని రంగు ఇసుకతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

• యానాం బీచ్:

Telugu Bapatla Beach, Gokarna Beaches, Telugu Beaches, Vodarevu Beach, Yanam Bea

యానాం బీచ్ తప్పక చూడాల్సిన మరొక బీచ్.ఇది రెండు నదులు కలిసే ప్రదేశంలో ఉంది.ఇక్కడ కనిపించే క్రిస్టల్ క్లియర్ బ్లూ కలర్ వాటర్ సందర్శకుల హృదయాలను దోచేస్తుంది.ఈ బీచ్‌లో శివుడు, ఇతర మతపరమైన విగ్రహాలు, ఈఫిల్ టవర్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి.

ఈ బీచ్ బంగాళాఖాతం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై ఉంది.

• రుషికొండ బీచ్:

రుషికొండ బీచ్ సర్ఫింగ్, స్కీయింగ్, కయాకింగ్, స్కూబా డైవింగ్ వంటి యాక్టివిటీస్‌కి పెట్టింది పేరు.ఆగస్టు నుంచి అక్టోబరు వరకు, జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.తక్కువ మంది ప్రజలు ఉంటారు కాబట్టి ఈ బీచ్‌లో సూపర్‌గా ఎంజాయ్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube