నీటి వనరులు పుష్కలంగా ఉండే నేలలలో రైతులు ఎక్కువగా మిరప లేదా ఉల్లి పంట సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తారు.అయితే ఈ రెండు పంటలలో ఏ పంటను సాగు చేయాలనుకున్న సాగు విధానంపై ముందుగా అవగాహన కల్పించుకోవాలి.
ఎందుకంటే ఈ పంటలకు చీడపీడల బెడదతో పాటు తెగుళ్ల బెడద కూడా కాస్త ఎక్కువే.సకాలంలో వీటిని నివారించడంలో విఫలం అయితే ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.

మిరప పంట( Chilli Crop )కు తీవ్ర నష్టం కలిగించి దిగుబడిని సగానికి పైగా తగ్గించడంలో పేనుబంక పురుగులు( Aphids ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగుల వల్ల కుకుంబర్ మొజాయిక్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది.మిరపకాయ తక్కువ దశలో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఈ పురుగులు పంటలు ఆశిస్తే, దిగుబడి తగ్గే అవకాశం ఉంది.ఈ పేనుబంక పురుగులు మిరప చెట్టులో బాగాలైన కొమ్మ, పూత, పిందెలను ఆశిస్తాయి.
ఈ పురుగులు మిరప మొక్కలోని అన్ని భాగాల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది.దీంతో మొక్కలు గిడసబారి పోతాయి.ఈ పురుగులను నివారించడంలో నిర్లక్ష్యం చేస్తే సగానికి పైగా దిగుబడి తగ్గుతుంది.

మిరప మొక్కల మధ్య, సాళ్ల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి.ముఖ్యంగా మిరపలో రెండు లేదా మూడుసార్లు అంతర కృషి చేపట్టాలి.మిరప పంటలు ఈ పేనుబంక పురుగులను గుర్తించి రసాయన పిచికారి మందులైన ఎసిఫేట్( Acephate ) 1.5గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఎసిటామిప్రిడ్ 0.2గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తేనే ఈ పురుగులు అరికట్టబడతాయి.







