ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ పెన్షన్ విధానం పై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.ఇదే సమయంలో ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు-2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్ నిర్ణయించడం జరిగింది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పి.ఆర్.సి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ ఏడాది “అమ్మ ఒడి( Amma Vodi Scheme )” పథకం అమలుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది.
అంతేకాదు ఈ ఏడాది “విద్యా కానుక” పంపిణీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

కొత్త మెడికల్ కాలేజీ( Medical College ) లలో 2118 పోస్టుల భర్తీకి నిర్ణయం, పోలీస్ బెటాలియన్ లో 3920 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.కొత్త డీఏ అమలనుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కూడా కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
చిత్తూరు డైరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమినీ లీజ్ ప్రతిపాదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ₹5000 కోట్ల రుణ సేకరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది.







