సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమను తాము రిప్రజెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తు వాళ్ళ అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ లో చాలామంది హీరోలు వాళ్ల స్టార్ డమ్ ను చూపించుకుంటూ పైకి ఎదిగిన వారే.
స్టార్ హీరోలు బీభత్సమైన స్టార్ డమ్ తో ముందుకు దూసుకెళ్తుంటే ఒక ఇద్దరు హీరోయిన్లు మాత్రం మన స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించారు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.
వాళ్ళు ఎవరు అంటే ఒసేయ్ రాములమ్మ( Osey Ramulamma ) సినిమాతో హీరో లేకుండా దాదాపు ఇండస్ట్రీ హిట్ కొట్టేంత కలెక్షన్స్ రాబట్టిన హీరోయిన్ విజయశాంతి.ఇండస్ట్రీ లో ఇప్పుడున్న పరిస్థితి వేరు, కానీ అప్పుడు మాత్రం హీరో లేకుంటే సినిమా థియేటర్ కి జనాలు వచ్చే వాళ్ళు కాదు.అప్పుడు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లు సినిమాలో ఉన్నారంటేనే జనాలు థియేటర్ కి వచ్చి ఆ సినిమాని చూసి ఆదరించేవారు.
అలాంటి సమయంలో దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) హీరోయిన్ ఓరియంటెడ్ గా ఒసేయ్ రాములమ్మ అనే సినిమాను తీసి సూపర్ సక్సెస్ కొట్టడమే కాకుండా విజయశాంతి( Vijayashanti )ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మార్చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత ఆమె దాదాపు ఒక పది సినిమాల వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసిందంటే ఆమె రేంజ్ ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఇదిలా ఉంటే అరుంధతి సినిమా( Arundhati )తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మరొక హీరోయిన్ అనుష్క.కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా విజయశాంతి తర్వాత ఆ రేంజ్ లో మన స్టార్ హీరోలకి వెన్నులో వణుకు పుట్టించిన హీరోయిన్ అనుష్క.
ఒక మంచి కథ ఉంటే చాలు సినిమాలో హీరో ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన ఈ రెండు సినిమాలు అలాగే ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy