ఎండాకాలంలో ఈత కొట్టడానికి ముందు కచ్చితంగా.. గుర్తుపెట్టుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు ఇవే..!

ఎండాకాలంలో( summer ) ఈత కొట్టడం అనేది చాలామంది లో ఒక అలవాటుగా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఊర్లలోనీ బావుల్లోకి చాలామంది ప్రజలు ఈతకు( swim ) వెళ్తారు.

ఇక నగరంలో స్విమ్మింగ్ ఫూల్స్ ( Swimming pool)అందుబాటులో ఉన్నాయి.ఎండాకాలంలో ఈత కొట్టడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే మీరు ఈత కొట్టడానికి ముందు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.మీరు నీటిలోకి ప్రవేశించే ముందు గుర్తించుకోవాల్సిన కొన్ని ఆరోగ్య చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండాకాలంలో ఫ్రెష్ గా ఉండడానికి ఈత ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా స్విమ్మింగ్ ఒక సులభమైన వ్యాయామం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే వేగంగా బరువు తగ్గాలనుకునే ( lose weight )వారికి ఈత చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.సరైన ఆరోగ్యం కోసం ఈ వేసవిలో ఈతకు ముందు తర్వాత కనీసం 10 నిమిషాల పాటు మీ శరీరాన్ని, కాళ్లు, చేతులను సాగదీయాలి.

ఈత కొట్టడానికి ముందు పది నుంచి పదిహేను నిమిషాలు నడవడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ సేపు ఈత కొట్టే అవకాశం ఉంటుంది.ఈత కొట్టేటప్పుడు నీరు త్రాగడం ఎంతో ముఖ్యం.

ఎండాకాలంలో మీరు చాలా త్వరగా అలసిపోతూ ఉంటారు.మీరు ఈతకు వెళ్లే ముందు కచ్చితంగా నీరు త్రాగాలి.

అవసరం అయితే ఒక బాటిల్ ని తీసుకెళ్లడం మంచిది.స్విమ్మింగ్ పూల్ లో ఎండాకాలంలో ఈత కొట్టేటప్పుడు పాటించాల్సిన ఒక ఆరోగ్యకరమైన చిట్కాను పాటించాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఈత కొట్టేముందు వ్యాయామం కచ్చితంగా చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే శరీరాన్ని కాస్త వేడెక్కించాలి.శరీరంపై గాయం ఉన్నవారు ఈతకు దూరంగా ఉండడమే మంచిది.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ఈత కొట్టడానికి గంట ముందు ఆహారం తినకపోవడం మంచిది.ఒకవేళ తింటే కడుపులో అసిడిటీ, కడుపునొప్పి సమస్య ఎదురవుతుంది.

గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈత ఎంతగానో ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు