అదృష్టం ఉంటే ఒక్కోసారి మనమేం కష్ట పడకపోయినా కనక వర్షం కురుస్తుంది.అయితే క్రీడాకారులు విషయంలో వారు గతంలో చేసిన కృషి భవిష్యత్తులో అదృష్టంగా మారి వారికి కనక వర్షం కురిపిస్తుంది.
ఇలాంటి అదృష్టం పొందే వారు చాలా తక్కువ మందే ఉంటారు.అయితే ఐపీఎల్ పుణ్యమా అని ముగ్గురు ఆటగాళ్లను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే కోట్లాది రూపాయలు సంపాదించారు.వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జయంత్ యాదవ్
ఐపీఎల్ 2022 వేలంలో గుజరాత్ టైటాన్స్ నుంచి భారత జట్టు ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ రూ.1.7 కోట్లు సొంతం చేసుకున్నాడు.రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన ఈ ప్లేయర్ ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకోవాలని అనుకుంది కానీ గుజరాత్ టైటాన్స్ పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది.అయితే ఐపీఎల్ 2022లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.దీంతో ఉచితంగా అతడికి కోట్లాది రూపాయలు దక్కినట్లయింది.
డొమినిక్ డ్రేక్స్
ఐపీఎల్‌లో కరేబియన్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ లక్కీ ప్లేయర్ గా నిలిచాడు.ఎందుకంటే అతడు ఇప్పటివరకు ఐపీఎస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రెండుసార్లు కొనుగోలు చేసింది.ఈ రెండు సార్లు సీఎస్‌కే టైటిల్ గెలుచుకుంది.
అయితే రెండు సార్లు టైటిల్ గెలిచిన జట్టులో ఉన్న కూడా ఇతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.అయినా కూడా అతడు సీఎస్‌కే ఫ్రాంచైజీ నుంచి కోట్లాది రూపాయలు సొంతం చేసుకున్నాడు.

రాజ్‌వర్ధన్ హంగర్కర్
టీమిండియా అండర్-19 ప్లేయర్ అయిన రాజ్‌వర్ధన్ వన్డే ప్రపంచకప్‌లో తన సత్తా చాటాడు.ఈ ప్రతిభ అతడికి కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టింది.సీఎస్‌కే జట్టు ఈ యంగ్ ఆల్‌రౌండర్‌ను రూ.1.5 కోట్లతో సొంతం చేసుకుంది.అయితే, ఇప్పటివరకు అతడికి ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా రాలేదు.







