సినిమా ఇండస్ట్రీ అంటేనే స్క్రీన్ మీద కనిపించే హీరో హీరోయిన్లను మాత్రమే ఆడియన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.వాళ్ళు చేసిన డాన్సులు చేస్తూ వాళ్ళు చెప్పిన డైలాగ్స్ చెప్తూ జనాలు వాళ్ళను అనుకరిస్తూ నిజ జీవితంలో వాళ్లు కూడా అవసరం అయిన సిచువేషన్ లో ఆ డైలాగులను వాడుతూ ఉంటారు.
అయితే స్క్రీన్ మీద జనం అందరి చేత మంచి మార్కులు వేయించుకున్న హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా వచ్చిన చాలా సినిమాల్లో చాలామంది హీరోయిన్లు నటించారు.అయినా కూడా మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేసి మహేష్ బాబు కి ఆన్ స్క్రీన్ జోడిగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్స్ ఎవరంటే ముందుగా మనం సమంత( Samantha ) గురించి చెప్పుకోవాలి.
సమంత మహేష్ బాబుతో దాదాపుగా మూడు సినిమాల్లో నటించింది.అందులో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి.ఇక ఆ తర్వాత మహేష్ బాబు తో మంచి కెమిస్ట్రీ కుదిరిన హీరోయిన్ ఎవరంటే కాజల్…( Kajal )
ఈవిడ మహేష్ బాబుతో దాదాపుగా రెండు సినిమాల్లో నటించింది.వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలావరకు ఇంప్రెస్సివ్ గా ఉంటుంది…ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయానికి వస్తే ఆయన చేసిన సినిమాల్లో ఖుషి సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ గా నటించిన భూమిక కి( Bhoomika ) పవన్ కళ్యాణ్ కి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి.ఇక భూమిక తర్వాత పవన్ కళ్యాణ్ తో ఆ రేంజ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అయిన హీరోయిన్ ఎవరంటే శృతిహాసన్( Shruti Hasan ) అనే చెప్పాలి.
ఈవిడ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.ప్రభాస్ కి( Prabhas ) జోడిగా ఆన్ స్క్రీన్ మీద నటించి మెప్పించిన వాళ్ల లో త్రిష( Trisha ) మొదటి స్థానంలో ఉంటారు.ఇక ఆవిడ తర్వాత ప్రభాస్ తో బెస్ట్ జోడి అనిపించుకున్న హీరోయిన్లలో కాజల్( Kajal ) ఒకరు… కాజల్ తో ప్రభాస్ డార్లింగ్,మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేశాడు ఈ రెండు సినిమాల్లో కూడా వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి…
.