పద్మశ్రీ అవార్డులు సాధించిన క్రీడాకారులు వీళ్లే..!

భారత కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను( Padma Awards ) ప్రకటించింది.భారత అత్యున్నత పురస్కారాలలో పద్మశ్రీ అవార్డు నాల్గవ అతిపెద్ద అవార్డు.

 These Are The Athletes Who Have Won Padma Shri Awards , Rohan Bopanna, Joshna Ch-TeluguStop.com

క్రీడా రంగానికి చెందిన పలువురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.ఆ క్రీడాకారులు ఎవరో చూద్దాం.

భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులు ఐదుగురు క్రీడాకారులను వరించాయి.వారు ఎవరంటే.

భారత బ్యాట్మెంటన్ దిగ్గజం రోహన్ బోపన్న, ఆసియా గేమ్స్ లో స్క్వాష్ లో పతకం సాధించిన జ్యోత్స్న చిన్నప్ప, పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా, ఆర్చర్ పూర్ణిమ మహతో, మాజీ హాకీ ప్లేయర్ హర్బిందర్ సింగ్ లకు పద్మశ్రీ అవార్డులను వరించాయి.

కర్ణాటక కు చెందిన బ్యాట్మెంటన్ ప్లేయర్ రోహన్ బోపన్న ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ లో పురుషుల డబుల్స్ లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన బోపన్న, ఇటీవలే ఏటీపీ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్న విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో రోహన్ బోపన్న( Rohan Bopanna ) ను సత్కరించింది.తమిళనాడుకు చెందిన స్క్వాష్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప ఇటీవలే ఆసియా గేమ్స్ లో పతకం సాధించింది.

దీంతో ఈమెకు కూడా పద్మశ్రీ అవార్డు వరించింది.

మధ్యప్రదేశ్ కు చెందిన పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా కు పద్మశ్రీ అవార్డు వరించింది.ఝార్ఖండ్ కు చెందిన ఆర్చర్ పూర్ణిమ మహతో( Purnima Mahato ) కు పద్మశ్రీ అవార్డు వరించింది.ఢిల్లీకి చెందిన మాజీ హాకీ ప్లేయర్ హర్బిందర్ సింగ్ కు పద్మశ్రీ అవార్డు వరించింది.

వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లంకంభ్ కోచ్ ఉదయ్ విశ్వనాథ దేశ్ పాండే, ఉత్తరప్రదేశ్ కు చెందిన పారా బ్యాట్మెంటన్ కోచ్ గౌరవ్ ఖన్నా లకు కూడా పద్మశ్రీ అవార్డులు వరించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube