తెలంగాణలో జనసేన పోటీ చేసే 32 నియోజకవర్గాలు ఇవే ..?

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు.ఇందులో ముఖ్యంగా పార్టీ పెట్టి సక్సెస్ అయిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ (NTR) ముఖ్యుడు అని చెప్పవచ్చు.

 These Are The 32 Constituencies That Janasena Will Contest In Telangana Details,-TeluguStop.com

ఆయన తర్వాత చిరంజీవి (Chiranjeevi) ప్రజారాజ్యం పెట్టారు.కానీ పార్టీని అధికారంలోకి తీసుకురాలేక చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసారు.ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాబోవు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.ఆయన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.

అంతేకాకుండా టీడీపీతో ఈసారి పొత్తు పెట్టుకొని ఎక్కువ స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు.

ఇదే తరుణంలో చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అవ్వడం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఇదంతా పక్కన తెలంగాణ రాష్ట్రంలో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలియజేస్తూ వచ్చారు.ఆ విధంగానే తెలంగాణలో ఆ 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ (Janasena party) తెలంగాణలో పోటీ చేసే 32 స్థానాల లిస్టును రిలీజ్ చేసింది పార్టీ అధిష్టానం.

Telugu Chandrababu, Chiranjeevi, Janasena, Pawan Kalyan, Prajarajyam, Sr Ntr, Te

ఇప్పటివరకు మేము సింగిల్ గా ఈ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ చివరి సమయంలో పొత్తులు పెట్టుకుంటే, ఈ స్థానాల్లో మార్పులు ఉండవచ్చని జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి (Bongunuri Mahender reddy) తెలియజేశారు.గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో జనసేన అనేక పోరాటాలు చేస్తుందని, ఆర్టీసీ కార్మికుల సమస్య కావచ్చు, డ్రగ్స్,మహిళలపై దాడులు,విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నామని తెలియజేశారు.

Telugu Chandrababu, Chiranjeevi, Janasena, Pawan Kalyan, Prajarajyam, Sr Ntr, Te

కాబట్టి ఈసారి జనసేన తెలంగాణ (Janasena Telangana) లో 32 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు.జనసేన పోటీ చేసే స్థానాలు నియోజకవర్గాల వారీగా చూస్తే కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, మునుగోడు,వైరా, పటాన్ చెరు, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, నర్సంపేట, పాలకుర్తి, అశ్వరావుపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, మంథని, హుజూర్ నగర్ , కోదాడ, వరంగల్ వేస్ట్, సత్తుపల్లి, వరంగల్ ఈస్ట్, మల్కాజ్ గిరి, ఖానాపూర్, మధిర, ఇల్లందు,పాలేరు, మేడ్చల్ ఈ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube