అమెరికాలో రాజుగారి గది, అక్కడ 10 గంటలుంటే రూ. 15 లక్షల బహుమానం

బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది చిత్రంలో ప్రముఖ టీవీ ఛానెల్‌ ఒక దెయ్యాల కొంపకు కొందరిని పంపిస్తుంది.

అక్కడ ఎవరైతే ఎక్కువ రోజులు ఉంటారో వారికి బహుమానం ప్రకటిస్తుంది.

డబ్బుకు ఆశ పడి ఆ ఇంట్లోకి వెళ్లిన వారికి దెయ్యాలతో చుక్కలు కనిపిస్తాయి.ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి.

అయితే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నట్లుగా మీలో ఎంత మందికి తెలుసు.ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక ఇంటి విషయాలు మీకు ఆశ్చర్యంను కలిగిస్తాయేమో.

ఈ ఇల్లు గత పదేళ్లుగా కొనసాగించబడుతుంది.ఈ పదేళ్లలో ఆ ఇంట్లోకి వెళ్లిన వారు కనీసం గంట కూడా ఉండలేక పోయారు.

Advertisement
Thesamehousein Americalikeraju Gari Gadhi Movie-అమెరికాలో ర

ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ముందుగానే ఆ ఇంట్లో ఎలాంటి దెయ్యాలు లేవు, ఎలాంటి ప్రాణ హాని జరుగదు అంటూ చెప్తారు.అయినా కూడా అందులోకి వెళ్లిన వారు అక్కడి వాటిని చూసి భయపడి కొద్ది సేపట్లోనే బయటకు వచ్చేస్తారు.

Thesamehousein Americalikeraju Gari Gadhi Movie

  అమెరికాలోని టెన్నెస్సి నగరంలో ఉన్న ఈ ఇంట్లోకి వెళ్లి 10 గంటలు ఉండి వచ్చే వారికి రూ.15 లక్షల బహుమానంను ఆ ఇల్లు నిర్వాహకులు ప్రకటించారు.కాని ఇప్పటి వరకు ఆ ఇంట్లోకి వెళ్లిన వారు బహుమానంను దక్కించుకోలేదు.

మొదట 5 లక్షలు ఉన్న బహుమానం ఇప్పుడు ఏకంగా 15 లక్షలకు పెరిగింది.మెల్ల మెల్లగా పాతిక లక్షలకు కూడా పెంచే యోచనలో ఉన్నారు.

ఎంత పెంచినా కూడా ఆ ఇంట్లో ఉండేంత సాహసం ఎవరు చేయడం లేదు అంటూ నిర్వాహకులు అంటున్నారు.

Thesamehousein Americalikeraju Gari Gadhi Movie
పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

  ఆ ఇంట్లోకి వెళ్లేందుకు మొదట ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా సర్టిఫికెట్‌ తెచ్చుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల నుండి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది.వారు ఒప్పుకున్న తర్వాతే ఇంటికి సంబంధించిన వారు వారిని లోనికి పంపిస్తారు.లోపల రక్తంతో నిండి ఉన్న ఒక టబ్బు, దెయ్యాల బొమ్మలు, అస్తి పంజరాలు వేలాడుతూ ఉంటాయి.

Advertisement

ఇంకా దెయ్యాల సినిమాలో ఉండేవన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటాయి.వాటన్నింటి మద్య ఏకంగా 10 గంటలు కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు.అందుకే కనీసం గంట కూడా ఎవరు ఉండలేక పోతున్నారు.

మీరు ధైర్యంతులు అయితే మీరు ఎప్పుడైనా అమెరికాకు వెళ్లే ప్రయత్నించండి.

తాజా వార్తలు