మేడిగడ్డ ప్రాజెక్టు వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలోనే మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు.
నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలని తెలిపారు.ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలిగిపోయేలా పని చేయాలని సూచించారు.







