జేబులో డబ్బులు లేవు ... సంచిలో కుమార్తె మృతదేహం ! అలా నడుచుకుంటూ...

తిత్లీ తుఫాన్ ప్రభావం తో ఏపీలోని శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి.ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు అందుతున్నా.

నష్టం మాత్రం తీర్చలేనంతగా ఉంది.ప్రస్తుతం ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరిని కలిచివేస్తోంది.

ముకుంద్ దొర అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కిలీమీటర్లు నడచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తిత్లీ తుఫాన్ సమయం నుంచి ముకుంద్ దొర కుమార్తె బబిత కనిపించకుండా పోయింది.తుఫాన్ సమయం వీచిన భీకర గాలులకు కొండచరియలు విరిగిపడడంతో బబిత మృతి చెందిందని నిన్న మొన్న అధికారులు ప్రకటించారు.

Advertisement

ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసిన అధికారులు.మృతదేహం ఎక్కడుందో చెప్పారు.

ప్రభుత్వ పరిహారం అందాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని.అందుకే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.తుఫాన్ దాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్.

వాహనం సమకూర్చుకోవడానికి డబ్బుల్లేక తన భుజాన కుమార్తె మృతదేహాన్ని ఓ సంచిలో మోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు.మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు.

అప్పటికప్పుడు వాహనం సమకూర్చారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు