అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya) ప్రస్తుతం కస్టడీ సినిమా( Custody Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు తమిళ భాషలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటులైనటువంటి శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రియమణి వంటి వారందరూ కూడా నటించడం విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి నాగచైతన్య ప్రశ్నిస్తూ అసలు ఈ సినిమాకి కస్టడీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అని అడిగారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ఈ సినిమాలో నటుడు అరవిందస్వామి (Aravind Swamy) పోషించిన పాత్రను బట్టి ఈ సినిమాకి కస్టడీ అని టైటిల్ పెట్టామని చైతన్య తెలియజేశారు.ఈ టైటిల్ ఎందుకు పెట్టామనే విషయం సినిమా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుందని తెలిపారు.
ఈ సినిమాలో అరవింద స్వామి లేకపోతే కస్టడీ సినిమానే లేదని ఈయన తెలియజేశారు.అరవింద స్వామి గారు ఈ సినిమాలో నటిస్తారనే విషయం తెలియగానే చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

మీ నుంచి పాన్ ఇండియా సినిమాని ఎప్పుడు ఆశించవచ్చు అని ప్రశ్నించగా… ఏదైనా కథను బలంగా నమ్మి సినిమాను చేస్తే అదే పాన్ ఇండియా సినిమా అవుతుందని అందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నం చేయనవసరం లేదని తెలిపారు.అఖిల్( Akhil ) తో కలిసి నటించడం గురించి కూడా ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మంచి కథ ఉంటే తప్పకుండా కలిసి నటిస్తామని అఖిల్ తో చేయడం కోసం తాను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







