ఆలోచన మంచిదే.. కానీ అడ్డంకులు ఎన్నో.. పవన్ కళ్యాణ్ కూడా తీర్చలేడు !

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సిరిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన( Janasena ) నాయకుడు ప్రమాణ స్వీకారం చేయగానే ఆంధ్రప్రదేశ్లోనే సినిమా స్టూడియోల నిర్మాణం జరగాలని అలాగే ఇండస్ట్రీ తరలి రావాలంటు పిలుపు ఇచ్చాడు.

ఆ ఆలోచన అయితే మంచిదే కానీ ఆచరణ మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి ఒక స్టార్ హీరో ప్రభుత్వంలో ఉన్నతమాత్రాన అది జరుగుతుందా అంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి.

కోనసీమ లాంటి ప్రాంతాన్ని షూటింగులకు అణువుగా మార్చుకోవాలి అంటూ చెబుతున్నారు.కేవలం స్టూడియోలకు స్థలాలు ఇస్తే సరిపోదు అక్కడ సినిమ తీయాలి అంటే అనేక కష్టనష్టాలు ఉన్నాయి.

ఎంతోమంది సినిమా స్నేహితులు ఉన్న చంద్రబాబు కూడా కాస్త ప్రయత్నించిన అదీ శూన్యమే.

There Is No Chance For Shootings In Ap , Pawan Kalyan, Vijayawada , Kandula D

ఒక సినిమా తీయాలంటే ఎంతో ఎన్నో వేల మంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది డబ్బింగ్ స్టూడియోలు, లొకేషన్స్ పర్మిషన్స్, జూనియర్ ఆర్టిస్టులు, RR, DI, CG అంటూ అనేక డిపార్ట్మెంట్స్ ఉండాలి.ఇక ఎంతో వేడిగా ఉండే విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతాలు షూటింగ్ కి అస్సలు పనిచేయవు అక్కడ మేకప్ వేసుకుంటే అది పగిలిపోతుంది.అంత వేడిగా ఉంటుంది మరి అలా దాటి వేరే చోటుకు వెళ్లాలంటే ట్రాన్స్పోర్ట్ తడిచి మోపడు అవుతుంది.24 విభాగాలకు సంబంధించి యూనియన్స్ ఉంటాయి.వారందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్న కూడా ఇప్పటికి ఇప్పుడు ఏమీ చేయలేరు.

Advertisement
There Is No Chance For Shootings In Ap , Pawan Kalyan, Vijayawada , Kandula D

ఇన్ఫ్రా ఏమాత్రం లేని ఒక ప్లేస్ లో సినిమా పరిశ్రమ రావాలి అంటే దానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టొచ్చు అందుకోసం నిరంతర శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

There Is No Chance For Shootings In Ap , Pawan Kalyan, Vijayawada , Kandula D

ఇక ప్రభుత్వం నుంచి రాయితీలు, కార్మికులకు గృహ వసతి సదుపాయాలు లాంటివి ఇచ్చిన కూడా ఇప్పట్లో పరిశ్రమ తరలి వెళ్ళదు.పూర్తిస్థాయి తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్( Hyderabad ) కి రావడానికి అప్పట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది అయినా కూడా ఇప్పటికీ ఎంతోమంది ఆర్టిస్టులు అక్కడే మిగిలిపోయారు.ఇక ఆంధ్ర కి సంబంధించిన కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు లేదా నిర్మాతలు దర్శకులు హైదరాబాదులో అనేక వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే సెటిలైపోయారు.

పైగా అన్ని అందుబాటులో ఉండగా ఆంధ్రకి వెళ్లి కొత్తగా కష్టాలు పడి సినిమా తీయాలని ఎవరు అనుకుంటారు.గతంలో ప్రకటించడం నంది అవార్డులకే దిక్కులేదు సినిమా పరిశ్రమలు తీసుకెళ్లి ఇప్పుడే చేసేదేమీ లేదు.

అందుకే కొన్నాళ్ల పాటు చిత్తశుద్ధితో పని చేయండి.ఆ తర్వాత అందరూ వస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ప్రభుత్వం వచ్చినా కొత్త కాబట్టి కాస్త ఆవేశంతో మాట్లాడుతున్నారు కానీ రియాలిటీ కి వచ్చిన తర్వాత ఈ హడావిడి ఉండకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు