అక్కడ అమ్మవారికి నైవేద్యంగా న్యూడిల్స్.. ఎక్కడంటే?

మన సనాతన భారత దేశంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు ఎన్నో కులమతాలకు నిలయమని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నాయి.

ఈ విధంగా ప్రతి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి భక్తులు వారి వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు.ఈ విధంగా పూజల అనంతరం స్వామివారికి ఏదైనా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం మనం చూస్తుంటాము.

అదే విధంగా మరికొన్ని చోట్ల స్వామివారికి నైవేద్యంగా మాంసాహారాన్ని సమర్పించడం చూస్తుంటాము.కానీ మీరు ఎప్పుడైనా అమ్మవారికి న్యూడిల్స్ నైవేద్యంగా సమర్పించడం చూశారా.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కోల్‌కతాలోని చైనా టౌన్‌లో ఉన్న అమ్మవారికి న్యూడిల్స్ నైవేద్యంగా సమర్పిస్తారు.అసలు అమ్మవారికి ఈ విధంగా నూడిల్స్ నైవేద్యంగా సమర్పించడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement
Chinese, Kali Temple, Chinese Kali Temple, Noodles,latest News -అక్కడ

కోల్‌కతాలోని చైనా టౌన్‌ (China Town)లో తంగ్రా అనే ఫేమస్ ఏరియాలో కాళీమాత ఆలయం ఉంది.అయితే ఈ ఆలయ పరిసర ప్రాంతాలలోకి వెళితే మనం ఇండియాలో ఉన్న మన సంగతి మర్చిపోయి చైనా వంటి దేశాలలో ఉన్న భావన కలుగుతుంది.

ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు నివసించడం వల్ల ఈ ప్రాంతంలో వెలసిన అమ్మవారికి న్యూడిల్స్ నైవేద్యంగా సమర్పిస్తారు.

Chinese, Kali Temple, Chinese Kali Temple, Noodles,latest News

ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చినప్పటికీ ముందుగా ఆలయంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తరువాతనే అక్కడ భక్తులకు నూడిల్స్ ప్రసాదంగా ఇస్తారు.కేవలం నూడిల్స్ మాత్రమే కాకుండా నూడిల్స్ తో పాటు చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ఇస్తారు.ఈ క్రమంలోనే ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులకు ఇది ఎంతో భిన్నంగా కనిపిస్తుంది.

ఇక ఆలయ విషయానికి వస్తే సుమారు 60 సంవత్సరాల క్రితం చెట్టు కింద రెండు విగ్రహాలు ఉండటంతో భక్తులు ఆ విగ్రహాలకు పూజలు చేస్తూ క్రమంగా ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ ఆలయాన్ని ఆ ప్రాంతంలో నివసిస్తున్న చైనీయులు బెంగాలీలు నిర్మించడం వల్ల ఈ ఆలయంలోని సంస్కృతి సంప్రదాయాలు కొంత భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు