ఏపీలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.ఒకట్రెండు నెలలు గడిపి ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారని విమర్శించారు.
విశాఖ రాజధాని అజెండాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పారు.75 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.నెల్లూరు జిల్లా ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు.ఎమ్మెల్యేల తిరుగుబాటు ముదరక ముందే ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా 160 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.







