అక్కడ స్కూల్స్ కు శుక్రవారం సెలవు, ఈ వింత ఆచారం ఇపుడు ఏమైందంటే?

అవును, మీరు విన్నది నిజమే.బేసిగ్గా మన దేశమంతటా స్కూళ్లల్లో ఆదివారాలే సెలవులు ఉంటాయన్న సంగతి మీకు తెలియంది కాదు.

అయితే అక్కడ స్కూళ్లల్లో మాత్రం శుక్రవారాలు సెలవులు ఇస్తున్నారు.అక్కడ ముస్లీంలు ఎక్కువగా నివాసం వుంటున్నారు.

అందుకే ఈ విధంగా వుంది.ఇలా దాదాపు రెండు సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

అయితే సదరు ఉర్దూ స్కూల్స్ లో విద్యార్థుల వారం సెలవుల విషయంలో ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆదివారం కాకుండా శుక్రవారాలు అక్కడ ఈ విధంగా గత 2 సంవత్సరాలుగా సెలవు ఇస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో దానికి చెక్ పెట్టారు అధికారులు.

Advertisement
There Is A Friday Holiday For Schools, What Happened To This Strange Custom Frid

ఇకపోతే, ప్రభుత్వ ఆదేశాలతో ఉర్దూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఎందుకంటే వారికి శుక్రవారాలు మాత్రమే సెలవులు కావాలట.

వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ లో చామతాడ జిల్లాలో అత్యధిక శాతం ముస్లీం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.ఈ జిల్లాలో మాత్రమే 43 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి.

ప్రభుత్వ అధీనంలో ఉన్న 43 ఉర్దూ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.జార్ఖండ్ ప్రభుత్వం ఆ స్కూల్ లో పని చేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది.

జార్ఖండ్ లోని చామతాడ జిల్లాలోని 43 ఉర్దూ స్కూల్స్ కు ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇస్తున్నారు.

There Is A Friday Holiday For Schools, What Happened To This Strange Custom Frid
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులకు ఆదివారం సెలవు తీసుకోవాలి.అయితే ఆదివారం కాకుండా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది.గత రెండు సంవత్సరాలుగా ఆదివారం కాకుండా శుక్రవారం ఉర్దూ స్కూల్స్ కు సెలవు ఇస్తున్నారని, ఆదివారం స్కూల్ లో విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులకు సమాచారం అందింది.

Advertisement

ఉర్దూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు అక్కడ పని చేసే టీచర్లు, సిబ్బంది ఆదివారం ఉద్యోగాలు చేసి శుక్రవారం స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు.ఈ తరుణంలో సెలవుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు