దేశంలో మార్పు కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi )అన్నారు.గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు, సంస్కరణలు తెచ్చామన్నారు.
రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.కరోనా లాంటి విపత్తులను జయించామని పేర్కొన్నారు.
ఎన్ని విపత్తులు ఎదురైనా అభివృద్ధి ఆగలేదన్నారు.
దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న మోదీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.క్లిష్ట సమయంలో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ భవనం తమకు గర్వకారణంగా నిలిచిందని తెలిపారు.17వ లోక్ సభను దేశం తప్పక ఆశీర్వదిస్తుందని వెల్లడించారు.