నేడు సోషల్ మీడియా బాగా ప్రబలడంతో స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఒక్క సోషల్ మీడియా అకౌంట్ అయినా కలిగి వున్నారు.ఇక స్మార్ట్ ఫోన్ సంగతి తెలియని మనిషి ఈ భూ ప్రపంచమీద ఉండరంటే నమ్మశక్యం కాదేమో.
దాంతో సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉందనేది నగ్న సత్యం.ఇకపోతే ప్రతి నిత్యం అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని మనల్ని అబ్బుర పరిస్తే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి, ఇంకొన్ని ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.తాజాగా సోషల్ మీడియాలో ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ గొర్రెల సమూహం ప్రపంచానికి ఓ సవాలులా, పజిల్‌లా మారింది.ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ముందే చెప్పాము కదా, ఆశ్చర్యం కలుగుతుందని.ఇక్కడ వీడియోలో ఉన్న గొర్రలు ప్రవర్తన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.దాంతో ఆ వీడియోపై అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
వీడియో చూస్తుంటే ఇదో CCTV ఫుటేజ్ అని చాలా క్లియర్ గా తెలుస్తోంది.దీన్ని నవంబర్ 16, 2022న పోస్ట్ చెయ్యగా ఇప్పటివరకూ… 80 లక్షల మందికి పైగా చూడటం కొసమెరుపు.
ఈ వీడియోని గమనిస్తే.ఇందులో వందకు పైగా గొర్రెలు.
గుండ్రంగా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి.
అయితే అవి అలా దాదాపు ఓ 10 రోజుల నుంచి అలాగే తిరిగుతున్నాయట.ఉత్తర
చైనాలోని ఇన్నర్ మంగోలియాలో
ఇలా జరుగుతోందని సమాచారం.అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఆ గొర్రెలు ఏమీ తినట్లేదనీ.
అయినా వాటికి నీరసం రావట్లేదని చెప్పడం కొసమెరుపు.నిపుణుల ఆలోచన ప్రకారం.
ఆ గొర్రెలకు లిస్టీరియోసిస్ అనే బ్యాక్టీరియా సోకిందని తేలింది.కాగా ఇది గొర్రెల మెదడుపై దాడి చేస్తుంది.
అందువల్ల గొర్రెల బ్రెయిన్ సరిగా పనిచెయ్యదు అని నిపుణులు చెప్పుకొచ్చారు.అయితే ఆ గొర్రెలను చూస్తే.
.వ్యాధి సోకిన వాటిలా లేవు అని స్థానికులు చెబుతున్నారు.