ఏపీలో పాలనపై సీఎం జగన్( CM Jagan ) కు క్లారిటీ ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.గతంలో ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandra babu naidu ) అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో నెలకొన్న అనేక రుగ్మతలకు వాలంటీర్ల ద్వారా పరిష్కారం లభించిందని చెప్పారు.

ఇష్టమైన వారికి ఓటు వేయండని చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందన్నారు.వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఏమీ లేవన్న మంత్రి ధర్మాన ప్రసాద రావు( Dharmana Prasada Rao ) అవసరం అయితే వాలంటీర్లు ఏజెంట్ గా కూర్చోవాల్సి ఉంటుందని వెల్లడించారు.గతంలో జన్మభూమి కమిటీలను కలవాలని కలెక్టర్లకే చెప్పే వాళ్లని పేర్కొన్నారు.అదేవిధంగా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని మంత్రి ధర్మాన వెల్లడించారు.







