ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దాని పూర్తి బాధ్యత డైరెక్టర్ మీదే ఉంటుంది.ఆయనే ఒక మంచి కథను తీసుకొని దాన్ని సినిమాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు.
కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన దానికి పూర్తి భాధ్యత డైరెక్టరే వహించాల్సి ఉంటుంది.ఇక సక్సెస్ కోసం ఒక్కో డైరెక్టర్ ఒక్కో రూట్ ను ఎంచుకొని సినిమాలు చేస్తారు.
ఇక ఈ విషయం లో తమిళ్ సినిమా డైరెక్టర్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే వాళ్లు చేసిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
నార్మల్ కథలతో వాళ్లు సినిమాలు చేయరు.ఇక మన దగ్గర వచ్చే రొటీన్ కమర్షియల్ సినిమాలైతే వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయరు.
ఇక తమిళనాడులో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతున్న బాల, వెట్రి మారన్, సెల్వ రాఘవన్( Bala, Vetri Maran, Selva Raghavan ) లాంటి డైరెక్టర్లు ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇక వెట్రి మారన్ అయితే ధనుష్ తో చేసిన అసురన్ సినిమాతో ఒక్కసారిగా ఇండియాలోనే పెను సంచలనాన్ని సృష్టించాడు.ఇక ఈ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్ప( Narappa ) అనే పేరుతో రీమేక్ అయింది.ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వ్యూయర్షిప్ ని సంపాదించుకుంది.
ఇక బాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.శివపుత్రుడు సినిమాతో తమిళ్, తెలుగు రెండు లాంగ్వేజ్ ల్లో ఉన్న ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు..

ఇక సెల్వరాఘవన్( Selvaraghavan ) కూడా ఆయన చేసిన 7/జి బృందావన కాలనీ( 7/G Vrindavan Colony ) సినిమాతో ఫస్ట్ టైం కల్ట్ క్లాసికల్ మూవీ తీసి ఇలాంటి సినిమాలు తీసి కూడా సక్సెస్ సాధించవచ్చా అని నిరూపించాడు.ఇక ఆ తర్వాత కార్తీ ని హీరోగా పెట్టి ఆయన తీసిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా సూపర్ సక్సెస్ అయింది.ఇక తమిళ ఇండస్ట్రీలో ఎంతమంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నా డిఫరెంట్ సినిమాలు తీయడం లో వీళ్ళ ముగ్గురికి ఉన్న క్రేజ్ మరే డైరెక్టర్ కి లేదనే చెప్పాలి…
.