ఆ వైసీపీ ఎంపీ పెరిగిపోతున్న అనుమానాలు.. బిజెపిలోకి వెళ్తున్నారంటూ..?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఘనవిజయం సాధించడం,  వైసిపి కేవలం 11 అసెంబ్లీ , నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే విజయం సాధించడంతో, ఆ పార్టీ మరింతగా డీలా పడుతోంది.

ఇక గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి( YCP ) 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్నా ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.ప్రస్తుతం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వైసిపి సాధించడంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.

ఇది ఇలా ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది.

Advertisement

ముఖ్యంగా వైసిపి అరకు ఎంపీ చెట్టి తనుజారాణి ( MP Chetty Tanujarani )బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది .వైసిపి నుంచి గెలిచిన ఎంపీలలో కడప నుంచి వైస్ అవినాష్ రెడ్డి జగన్ కు సోదరుడు కావడంతో ఆయన పార్టీ మారే అవకాశాలు లేవు.అలాగే రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి ( Mithun Reddy )జగన్ కు అత్యంత సన్నిహితుడు.

మరో నమ్మకమైన వ్యక్తిగా ఉన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పార్టీ మారే అవకాశం లేదు.దీంతో అరకు ఎంపీ చెట్టి తనుజారాణి పైనే ఇప్పుడు వైసీపీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

ఇప్పటికే బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలు ఆమెతో మంతనాలు చేసినట్లుగా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఇటీవల జగన్ తోనూ భేటీ అయ్యారు.అయినా ఆమె బిజెపి టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటివరకు తనపై వస్తున్న పుకార్ల విషయంలో అరకు ఎంపీ స్పందించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు