కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Congress Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ నేత బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ఆయనే చెప్పాలని పేర్కొన్నారు.
బండి సంజయ్( Bandi Sanjay ) అవినీతిపరుడని ఆరోపణలు వస్తున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాటికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కిషన్ రెడ్డిని కేసీఆర్ అపాయింట్ చేయించారని ప్రచారం ఉందని తెలిపారు.
అలాగే వర్షాల వలన జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.







