అమ్మాయితో అలా ప్ర‌వ‌ర్తించిన యువ‌కుడు.. అమ్మాయి ఏం చేసిందంటే..?

అమ్మాయిల‌ను ఏడిపించే ఘ‌ట‌న‌లు మ‌నం ఇప్ప‌టికే అనేకం చూస్తూనే ఉన్నాం.

ఇక సినిమాల్లో ఇలాంటివి ప‌రిపాటిగా ఉంటే నిజ‌జీవితంలో అయితే అస‌లు వెలుగులోనికి రానివే అనేకం ఉంటున్నాయి.

ఇక ఇలాంటి స‌మ‌యాల్లో అమ్మాయిలు కొన్నిసార్లు తెగువ చూపిస్తున్నా.మ‌రి కొంద‌రు మాత్రం మౌనంగానే భ‌రిస్తున్నారు.

వాస్త‌వానికి ఇప్పుడిప్పుడు అనేక ర‌కాలుగా అమ్మాయిలు కొంత తెగువ చూపిస్తున్నార‌నే చెప్పాలి.అయితే ఇప్పుడు ఓ అమ్మాయి త‌న‌ను ఓ యువ‌కుడు అస‌భ్యంగా తాకితే ఏ మాత్రం ఊరుకోకుండా చిత‌క్కొట్టేసింది.

రోడ్డుపై నిల‌బెట్టి ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఆ యువ‌కుడికి ముచ్చెమటలు పట్టించింద‌నే చెప్పాలి.ఈ గ‌ట‌న కాస్తా జులై 30న అస్సాంలో చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ ఘటన కొంచెం ఆలస్యంగా బ‌య‌ట‌కు రావ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఇక అస్సాం రాష్ట్రంలోని గువహటికి చెందిన భావన కశ్యప్ అనే అమ్మాయి స్థానికంగా నివాసం ఉంటోంది.

అయితే ఆమె ద‌గ్గ‌ర్లోని రుక్మిణి నగర్‌ రోడ్డుపై వెళ్తుండ‌గా.అటుగా స్కూటీపై వెళ్లే రాజ్‌కుమార్ అనే యువ‌కుడు ఆమెను అస‌భ్యంగా తాకాడు.

దీంతో అమ్మాయికి చిర్రెత్తుకు వ‌చ్చింది.ఇక ఈ గ్యాప్‌లోనే పారిపోవటానికి ఆ వ్య‌క్తి ఎంత‌గా ప్రయత్నించినా భావన మాత్రం అతడ్ని పట్టుకుని ర‌ఫ్ ఆడించింది.రోడ్డుపై అందరూ చూస్తుండ‌గానే ఆ వ్య‌క్తి దుమ్మ దులిపేసింద‌నే చెప్పాలి.

ఇక ఆ యువ‌కుడు ఎంత‌గా ట్రై చేసినా ఆమె మాత్రం విడిచిపెట్ట‌కుండా బాగానే బుద్ధి చెప్పింది.ఇక ఆ త‌ర్వాత ఆయ‌న్ను పోలీసులకు పట్టించింది భావ‌న‌.ఇక ఈ వివ‌రాల‌ను త‌న ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్ చేయ‌గా తెగ కామెంట్ల వ‌ర్షం కురిపించారు నెటిజ‌న్లు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

ఎంతైనా అమ్మాయిలు ఇలా డేర్‌గా ఉంటేనే స‌మాజంలో మార్పు వ‌స్తుందంటూ అంద‌రూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు