ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని ఏ పి ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మధురవాడ జోన్ కమిటీ డిమాండ్ చేసింది యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధురవాడ పిహెచ్సి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం లో ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈసందర్భంగా ఆశా యూనియన్ జోన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం కనకరత్నం, బీ విజయ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని తాకుతున్న మాకు ఇచ్చే గౌరవ వేతనం పెంచడం లేదని,ఈ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు గౌరవ వేతనం 15 వేలకు పెంచాలని కోరారు.ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆశాల పని వొత్తిడి విపరీతంగా ఉంటుందని పనిభారాన్ని తగ్గించడంతో పాటు సెలవులు ఇవ్వాలని కోరారు.
విధులు నిర్వర్తించే క్రమంలో ప్రమాదాలకు గురి అయ్యి చనిపోయిన వారికి క్షత గాత్రులు అయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు గ్లోబల్ హెల్త్ లీడర్స్ గా ఆశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) గుర్తించిందని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా లను కార్మికులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమం లో సీఐటీయూ జోన్ అధ్యక్ష కార్య ధర్సులు డీ అప్పలరాజు,పి రాజు కుమార్,యూనియన్ నాయకులు ఎం పార్వతి,కే లక్ష్మి,ఎన్ అప్పలకొండ, రామ,బి పార్వతి,కే సుధా,పీ అప్పల నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.







