ఉండి లో రాజుల యుద్ధం .. ముగ్గురూ ముగ్గురే 

ఏపీలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రాజుల మధ్య టికెట్ పోరు నడుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకి( Mantena Ramarajuki ) టిడిపి అధిష్టానం ఎప్పుడో టికెట్ ఖరారు చేయడంతో, ఆయన మమ్మురంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు.

అయితే ఆ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ( కలవపూడి శివ ) కు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనాల్లోనే ఉంటున్నారు.వీరిద్దరి మధ్య పోరు కొనసాగుతూ ఉండగానే ,నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల టిడిపిలో చేరడం, ఉండి నియోజకవర్గంలో వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.

నరసాపురం ఎంపీ టికెట్  రఘురామకృష్ణం రాజుకు ఇప్పించేందుకు చంద్రబాబు( Chandrababu ) ఎన్ని ప్రయత్నాలు చేసినా అయన ఒప్పుకోకపోవడం, అక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించడంతో, రఘురామకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ అయినా కేటాయించాల్సిన పరిస్థితి టిడిపి అధిష్టానానికి ఏర్పడింది.ఈ క్రమంలోనే ఉండి నియోజకవర్గం టికెట్ ను రంగురామకృష్ణం రాజు కు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఇదే విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత టిడిపి అభ్యర్థి మంతెన రామరాజుకు చెప్పి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసినా, ఆయన ఆ సీటు నుంచి తప్పుకునేందుకు ఇష్టపడడం లేదు.పైగా పార్టీ తనకు టికెట్ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని హెచ్చరికలు టిడిపి అధిష్టానానికి పంపుతున్నారు .వెంకట శివరామరాజు( Venkata Sivaramaraju ) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం, ఇప్పుడు రామరాజుకు టికెట్ దక్కకపోతే, ఆయన పోటీలో ఉండే ఛాన్స్ కనిపిస్తుండడంతో టీడీపీ హైరానా పడుతుంది.

The War Of Kings In Undi Three Are Three, Tdp, Janasena, Bjp, Undi Constency, Un
Advertisement
The War Of Kings In Undi Three Are Three, Tdp, Janasena, Bjp, Undi Constency, Un

టిడిపికి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో ముగ్గురు రాజుల మధ్య పోరు మొదలు కావడంతో ఇది వైసీపీకి ( YCP )కలిసి వస్తుందని టిడిపి టెన్షన్ పడుతుంది.రఘు రామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు.రఘురామ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గంలో తనకంటూ సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈనెల 22 నామినేషన్ వేయబోతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.ఈ మేరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

The War Of Kings In Undi Three Are Three, Tdp, Janasena, Bjp, Undi Constency, Un

మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తన టికెట్ ను మరొకరికి ఇస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని హెచ్చరికలు పంపుతున్నారు.మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు .తనకు టిడిపి టికెట్ కేటాయిస్తే సరే సరే లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలుస్తాననే ధీమాలో శివరామరాజు ఉన్నారు.దీంతో ఉండి నియోజకవర్గంలో నెలకొన్న ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించాలో  తెలియక టిడిపి అధిష్టానం సతమతం అవుతోంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు