దేశవ్యాప్తంగా 125 మంది పోలీసులను సత్కరిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..!!

దేశవ్యాప్తంగా ఆదివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది.

ముఖ్యంగా డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉన్నట్లు.తల పటంతో దేశ రాజధానిలో ఇంకా పలు కీలక రాష్ట్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడికక్కడ భద్రత విషయంలో జల్లెడ పడుతున్నారు.ఇదిలా ఉంటే స్వతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా 125 మంది పోలీసులకు అత్యుత్తమ నేరపరిశోధన అవార్డులు అందించడానికి రెడీ అయింది.

ఇందులో సిబిఐ తో పాటు ఎన్ఐఎ, ఎన్ సిబి సిబ్బంది నీ సైతం ఎంపిక చేశారు.ఏడాదిలో అత్యుత్తమ నేర పరిశోధన చేసిన దేశవ్యాప్తంగా ఉన్న అధికారులకు యూనియన్ మినిస్టర్స్ పేరిట మెడల్స్ అవార్డులు.

Advertisement
Union Home Minister's Medal For Excellence In Investigation Union Home Minister'

అందిస్తోంది కేంద్రం.ఈ క్రమంలో అత్యధికంగా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ నుండి పోలీసులు సెలక్ట్ అయ్యారు.

యూపీ, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, బీహార్, ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులకు కూడా ఈ మెడల్స్ అవార్డులు వరించనున్నాయి.

Union Home Ministers Medal For Excellence In Investigation Union Home Minister

కేంద్ర ప్రభుత్వం 2018 వ సంవత్సరం నుండి ఈ ఎక్స్లెన్స్ అవార్డులు ప్రధానం చేస్తూ ఉంది.నేర పరిశోధనలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసులను ప్రోత్సహిస్తూ అవార్డులు అందిస్తూ ఉంది.ఈ పరిశోధన విభాగం ఐదు రకాలుగా గుర్తిస్తూ ఐదు రకాల మెడల్స్ అందిస్తోంది.

గత ఏడాది ఎక్స్లెన్స్ అవార్డు లకు 121 మంది ఎంపిక కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 125 మంది సెలక్ట్ అయ్యారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు