మరికాసేపటిలో తీరం దాటనున్న తుపాన్..!

మిచాంగ్ తుపాను మరికాసేపటిలో తీరం దాటనుంది.ఈ మేరకు బాపట్ల సమీపంలో తీరం దాటనుండగా ఆ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.

 The Typhoon Will Cross The Coast Soon..!-TeluguStop.com

తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా కుండపోత వానలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు.వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అలాగే పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది.తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.అయితే రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube