ఏపీలో టైటిలింగ్ యాక్ట్ చట్టంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasada Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు 170 దేశాల్లో టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉందని ఆయన తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ( Land Titling Act )పై కేంద్రం కొన్ని సూచనలు చేసిందని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.నీతి ఆయోగ్( NITI Aayog ) చూపించిన మోడల్ ప్రకారం యాక్ట్ తీసుకొచ్చామన్నారు.

ఇంకా చట్టం అమలు చేయలేదన్న ఆయన కొన్ని మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు.న్యాయవాదులకు( Lawyers ) కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వారితో ముఖాముఖి మాట్లాడతామని వెల్లడించారు.న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు.సర్వే పూర్తి చేసిన తరువాతే పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందన్న ఆయన పేద ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే టైటిలింగ్ యాక్ట్ చట్టమని స్పష్టం చేశారు.







