అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
కాగా శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.
కాగా మృగశిర నక్షత్రం అభిజిత్ ముహుర్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అదే రోజున దీపోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారని సమాచారం.