పులితో పరాచికాలా... టూరిస్ట్‌ని పరుగులంకించిన పులి!

సోషల్ మీడియా వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ఎక్కడలేని వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.అందులో మనం ఈ జీవితంలో చూడలేని దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి.

ఉదాహరణకు ఇక్కడ అందరూ ఇతర దేశాలకు వెళ్లలేకపోవచ్చు, అదేవిధంగా అక్కడ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోలేకపోవచ్చు.కాని నేడు ఆ పరిస్థితి లేదు.

సోషల్ మీడియా పుణ్యమాని ఇతర మనుషుల ఆచార వ్యవహారాల గురించి చాలా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం.

అసలు విషయంలోకి వెళితే, ఈమధ్య కాలంలో జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.తాజాగా అలా సేదతీరుదామని సరదాగా ఓ పార్క్‌లోకి వెళ్లిన టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది.ఓ పులి( tiger ) వారిని వెంబడించడంతో పరుగులు తీశారు.

Advertisement

కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద ట్విట్టర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

విషయంలోకి వెళితే, ఉత్తరాఖండ్‌( Uttarakhand )లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లోకి సఫారీలో కొంతమంది పర్యాటకులు వెళ్లడం జరిగింది.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ, వాటి చిత్రాలని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి కనిపించింది.

దీంతో సఫారీ జీప్‌ డ్రైవర్‌ ( Safari Jeep Driver )కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకొనే పనిలో మునిగిపోయారు.ఈ క్రమంలో పులికి తిక్కరేగిందో ఏమో గాని, ఒక్కసారిగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేయగా పర్యాటకులు భయంతో కేకలు వేసి, అక్కడినుండి పారిపోయారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Krishna , Vijaya nirmala : కృష్ణ గారి ఆస్తి కంటే విజయ నిర్మల ఆస్తి ఎక్కువట నిజమేనా..?
Advertisement

తాజా వార్తలు