తాళపత్రాలను చెక్కు చెదరకుండా కాపాడే టెక్నాలజీ.. తెలుగు వ్యక్తే ఆవిష్కర్త

మన పూర్వీకులు ఎన్నో విలువైన విషయాలను తాళపత్రాలలో రాసి భద్రపరిచే వారు.

చాలా మంది ఇళ్లలో అటక ఎక్కి పరిశీలించినప్పుడో, ఏవైనా తవ్వకాలు జరిపినప్పుడో అవి బయటపడతాయి.

అందులో సైన్స్, హిస్టరీ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగా ఉంటాయి.వాటిపై పరిశోధన చేయాలంటే ఖచ్చితంగా వాటిని చెక్కు చెదరకుండా భద్ర పరచాల్సి ఉంటుంది.

The Technology To Protect The Palm Leaves From Being Tampered With.. Telugu Pers

సరిగ్గా ఇలాంటి టెక్నాలజీని ఇటీవల కనిపెట్టారు.దానికి ప్రొఫెసర్ పాణ్యం నరహరి శాస్త్రి పరిష్కారం చూపారు.

ఆయన ప్రస్తుతం చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆయన అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తాళపత్రాలలోని చేతి రాతను గుర్తించేందుకు ప్రత్యేక 3డి ఫంక్షన్‌తో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించారు.

Advertisement

అద్భుతమైన ఆవిష్కరణకు గాను స్వాతంత్య్ర దినోత్సవం నాడు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ హబ్ ఆయనను ఘనంగా సత్కరించింది.తాళపత్రాలు అనేవి మన జాతి సంపద.

విలువైన ప్రాచీన చరిత్ర, సంస్కృతిని ప్రస్తుత తరానికి తెలియజేసేవి అవే.వాటిపై రాసిన భాషను అర్థం చేసుకోవడం ఓ పట్టాన సాధ్యపడదు.కాలం గడిచే కొద్దీ అవి పాడవుతూ ఉంటాయి.

సగం సగం రాతలను చూసినప్పుడు అవి గజిబిజిగా ఉంటాయి.అయితే సరికొత్త టెక్నాలజీతో డాక్టర్ నరహరి శాస్త్రి అలాంటి రాతలను అర్ధం చేసుకోవడం సులభం చేసేశారు.

దీనికి సంబంధించి, జూలైలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా నుండి 3డి టెక్నిక్‌‌పై పేటెంట్ పొందారు.ఆయనే సీబీఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌వి కోటేశ్వరరావు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.కృష్ణన్‌ల సహకారంతో డాక్టర్ నరహర శాస్త్రి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.దీంతో తాళపత్రాలను డిజిటలైజ్ చేసి, అందులోని ప్రతి అక్షరాలను కంప్యూటర్ కనిపెట్టే విధంగా త్రీడీ టెక్నాలజీ అభివృద్ధి చేశారు.

Advertisement

కొన్ని సందర్భాలలో ఏదైనా కారణాల వల్ల తాళపత్రాలపై పాడైన, చెరిగి పోయిన అక్షరాలను కూడా ఇది కనిపెడుతుంది.

తాజా వార్తలు