తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ సీట్లు సాధించడమే తమ లక్ష్యమని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.నిన్న హైదరాబాద్ లో బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలకు ప్రాముఖ్యత ఉందన్నారు.
ఈ మేరకు 119 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించామని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రజలు విసిగిపోయారని లక్ష్మణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణణాతీతంగా మారాయన్నారు.రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు.
ఎన్నికల్లో గెలుపుకోసం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యమని తెలిపారు.160 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడించారు.







