మనదేశంలోని స్థానిక మాండలికాలను(యాస) కాపాడుకునేందుకు కృషి చేయాలని విద్యావేత్తలు సూచిస్తుంటారు.ఇది మన స్థానిక గుర్తింపును కాపాడుకోవడానికి తప్పనిసరి అవసరం అని చెబుతుంటారు.ఇందుకోసం ముందుగా స్థానికులు తమ మాండలికాన్ని గౌరవించాలి.తద్వారా ఇతరులు అక్కడి మాండలికాన్ని గౌరవిస్తారు.ఈ దిశగా స్టేజ్ యాప్ ఎంతో కృషి చేస్తోంది.స్టేజ్ యాప్ అనేది ఒక ఓటీటీ ప్లాట్‌ఫారమ్, దీనిలో ఎవరైనా సరే హర్యాన్వి, మార్వాడీ తదితర మాండలికాలలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు షార్ట్ ఫిల్మ్‌లు మొదలైన స్థానిక కంటెంట్‌ను చూడవచ్చు.స్టేజ్ యాప్ అనేది స్థానిక మాండలికాల కంటెంట్ తో కూడి ఉంటుంది.
‘మనది కంపెనీ కాదు, విప్లవం
స్టేజ్ యాప్‌ను హరియాణాలోని భివానీకి చెందిన వినయ్ సింఘాల్, అతని సోదరుడు ప్రవీణ్ సింఘాల్, వారి స్నేహితుడు శశాంక్ వైష్ణవ్‌తో కలిసి ప్రారంభించారు.శశాంక్ ఇండోర్‌కు చెందినవాడు.వినయ్‌కి క్లాస్‌మేట్.గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకరితో ఒకరు మంచి అనుబంధం కలిగి ఉన్నారు దేశంలో మాండలికాల విప్లవాన్ని తీసుకురావాలని వినయ్, అతని సహచరులు భావించారు.అందుకే వారు మాండలికాలతో పరిచయం పెంచుకున్నారు.
మనం కంపెనీ కాదు, మనది విప్లవం’ అనే ట్యాగ్ లైన్‌తో వారు ముందుకు సాగుతున్నారు.

ఇటీవల ఈ ముగ్గురూ నిధుల సేకరణ కోసం షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2కి హాజరయ్యారు.వారి మాటలు విని అక్కడున్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు.ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బహుశా మొదటిసారిగా నేషనల్ టీవీలో, వినయ్, అతని సహచరులు తమ పోరాటాన్ని దేశానికి వివరించారు.
స్టేజ్ యాప్ఒ క్క రాత్రిలో 40 కోట్ల బిజినెస్.
వినయ్ షార్క్ ట్యాంక్ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టేజ్ యాప్‌ను ప్రారంభించే ముందు తాము 2014 నుండి విట్టీఫీడ్ పేరుతో ఒక వ్యాపారాన్ని నడిపామని చెప్పారు.ఇది ఫేస్‌బుక్‌లోని ఒక పేజీ.దీనిలో వినియోగదారుల కోసం ఫన్నీగా ఉండే ఆసక్తికరమైన కంటెంట్‌లను అందించేవారు.వారి పోస్టులు.వీడియోలు వైరల్ అవుతుండేవి.
ఇప్పుడు వారు నెలకొల్పిన స్టేజ్ యాప్ కంపెనీ ప్రపంచ స్థాయిలో ఉంది.చాలా చోట్ల సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.
ఈ కంపెనీలో 125 మంది పనిచేస్తున్నారు.కంపెనీ నుండి ఏటా దాదాపు 40 కోట్ల ఆదాయం సమకూరుతోంది.







